హాట్ డిబేట్: ఇలియానా బొద్దుతనం

0

ప్రస్తుతం టాలీవుడ్లో ఓ ఆసక్తికర విషయం పై జనం ఎక్కువ దృష్టి సారించారు. చాలా గ్యాప్ తర్వాత `అమర్ అక్బర్ ఆంటోని` చిత్రంతో తెలుగు సినీపరిశ్రమలో రీఎంట్రీ ఇస్తున్న ఇల్లూపైనే దృష్టంతా. ఇలియానాని యువతరం చాలా ప్రత్యేకంగా పరిశీలనగా చూస్తున్నారు. బోయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో సహజీవనం నేపథ్యంలో ఇలియానాలో వచ్చిన మార్పుల్ని అంతే డీటెయిల్డ్‌గా తరచి చూస్తున్నారు.

అలా వీక్షించే వాళ్లకు సడెన్‌గా ఓ ట్విస్టు. నేడు ఈ సినిమాలోంచి “డాన్ బాస్కో… పని చూస్కో… ట్రై చేస్కో… దొరకను కాస్కో…“ అంటూ మాంచి ఊపుమీదున్న లిరికల్ పాటను ఆ సాంగ్ మేకింగ్ వీడియోని టీమ్ రిలీజ్ చేసింది. ఈ పాట ఎలా ఉంది? ఇందులో మాస్ మహారాజా ఎలా డ్యాన్సులు చేశాడు? ఎలాంటి గెటప్ వేశాడు? అన్నదానికంటే విజవల్స్ ఆద్యంతం ఇలియానాపైనే ఫోకస్ కనిపించింది. అంతేకాదు .. బొద్దుగా ముద్దొస్తున్న ఇలియానా పైనే యూత్ కాన్సన్ట్రేషన్ ఖాయమన్న ఆసక్తికర చర్చ సాగుతోందిపుడు. థమన్ బీట్‌లో ఊపు కంటే ఇలియానాలోని హుషారే ప్రత్యేకించి చర్చకొచ్చింది.

బొద్దందం ముసిముసిగా నవ్వేస్తూ కుర్రకారు గుండెల్ని అంతే ఇదిగా గిటార్ వాయిస్తోంది. ఈ పాటను రమ్య బెహ్రా మనిషా హరితేజ శ్రీకృష్ణ జస్ప్రీత్ పాడారు. ఇండోర్ లొకేషన్స్ లో విజువల్ రిచ్‌గా చిత్రీకరించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అమర్ అక్బర్ ఆంటోని చిత్రాన్ని ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావించాయో ఈ వీడియోలే చెబుతున్నాయి. ఈ నెల 16వ సినిమా రిలీజవుతోంది.
Please Read Disclaimer