వైజాగ్ సెక్స్ రాకెట్ లో అరెస్ట్ అయ్యింది నేను కాదు

0

జబర్దస్త్ కమెడియన్స్ దొరబాబు ఇంకా పరదేశిలు వైజాగ్ సెక్స్ రాకెట్ లో పట్టుబడ్డ విషయం తెల్సిందే. పోలీసుల రైడ్ లో మొత్తం ఆరుగురు పట్టుబడగా అందులో వీరిద్దరు ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ లో ఉన్న వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సమయంలోనే సెక్స్ రాకెట్ లో అరెస్ట్ అయ్యింది దొరబాబు కాదని అతడిలా ఉండే దావూద్ అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.

చూడ్డానికి దొరబాబు మరియు దావూద్ లు ఒకేలా ఉంటారు. ఒకానొక సమయంలో దొరబాబుకు డబుల్ పోజ్ కోసం జబర్దస్త్ లో దావూద్ ను కూడా నటింపజేశారు. ఇప్పుడు ఆ దావూద్ మీడియా ముందుకు వచ్చాడు. సెక్స్ రాకెట్ లో పట్టుబడినది తాను అంటూ వస్తున్న వార్తలు నిజం కాదని.. తాను అలాంటి వాడిని కాదు అంటూ చెప్పుకొచ్చాడు.

ఇద్దరం సేమ్ ఉండటం వల్ల చాలా మంది నాకు ఫోన్ చేసి అసలేం జరిగిందని ప్రశ్నిస్తున్నారు. నా కుటుంబ సభ్యులు కూడా టెన్షన్ పడుతున్నారు. అందుకే మీడియా ముందుకు వచ్చాను. నన్ను పోలీసులు అరెస్ట్ చేయలేదు.. అసలు నేను అక్కడ లేను. దొరబాబు ఇలాంటి కేసులో ఎలా ఇరుక్కున్నాడో పాపం అన్నాడు. ఇంకా దావూద్ మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే సినిమాల్లో నిలదొక్కుకుంటున్న నాపై ఇలాంటి పుకార్లు పట్టించవద్దంటూ విజ్ఞప్తి చేశాడు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-