దర్శకుడి అత్తగారిని ఎమ్మెల్యే హత్య చేయించాడట

0

‘దొరసాని’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన కేవీఆర్ మహేంద్ర మొదటి ప్రయత్నంతోనే డైరెక్టర్ గా పాస్ మార్కులు సంపాదించాడు. సినిమా కమర్షియల్ గా అంతగా ఆడకపోయినా కూడా మహేంద్రకు మాత్రం గుర్తింపు దక్కింది. తాజాగా ఈయన ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం.. తన వైవాహిక జీవితం గురించిన విషయాలను చెప్పుకొచ్చాడు.

మహేంద్ర మాట్లాడుతూ… నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. చాలా కాలం పాటు మా ఇద్దరి మద్య ప్రేమ కొనసాగింది. మేమిద్దరం రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకుని ఎవరికి వాళ్లం అన్నట్లుగా కొంత కాలం ఉన్నాం. మా పెళ్లికి పెద్దల నుండి వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా ఆమె తండ్రి మరియు అన్న నుండి చాలా గొడవలు వచ్చాయి. కొన్నాళ్లకు వాళ్లు సర్దుకున్నారు. మేమిద్దరం మళ్లీ అందరి సమక్షంలో వివాహం చేసుకున్నాం. ప్రస్తుతం మా ఆవిడ వారి కుటుంబ సభ్యులతో బాగానే ఉంటుంది. నేను మాత్రం అంతగా కలిసి పోలేను. వారు కూడా నాతో అంతంత మాత్రంగానే ఉంటారు.

ఎమ్మెల్యేగా ఉన్న ఒక వ్యక్తి నా భర్య తల్లిని చంపించాడట. మా అత్తగారు ఎంపీటీసీగా ఉన్న సమయంలో ఈమె రాజకీయంగా మనకు పోటీ అవుతుందనే ఉద్దేశ్యంతో చంపేశారట. ఆ సమయంలో నా భర్య వయసు మూడు సంవత్సరాలు. ఆమె అన్న వయసు 10 సంవత్సరాలు. అప్పటి నుండి నా భర్యను ఆమె అన్నయ్య చాలా జాగ్రత్తగా పెంచాడట. ఈ విషయాలన్నీ కూడా నాకు నా భార్య ఎప్పుడు చెబుతూ ఉంటుందని మహేంద్ర అన్నాడు. ఇక త్వరలోనే రెండవ సినిమా ప్రయత్నాలు మొదలు పెడతానంటూ చెప్పుకొచ్చాడు.
Please Read Disclaimer