2020 కిక్కిచ్చింది సరే.. 2021 సంక్రాంతి?

0

2020 సంక్రాంతి పోరు నువ్వా నేనా? అన్నట్టుగా హోరాహోరీగా సాగింది. నాలుగు సినిమాలు రిలీజైతే రజనీ – దర్బార్ ఆరంభమే పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అందుకుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ .. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మధ్య వార్ రసవత్తరంగా సాగింది. సంక్రాంతి రేస్ లో బన్ని క్లీన్ విన్నర్ గా నిలవడం పై ఆసక్తికర చర్చ సాగింది. తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ లోనూ బన్ని నాన్ బాహుబలి రికార్డుల్ని అందుకున్నామని గర్వంగా ప్రకటించాడు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అంటూ మహేష్ టీమ్ ప్రకటించింది. ప్రమోషన్ సహా కలెక్షన్స్ పైనా వరుస పోస్టర్ల తో ఇరు వర్గాలు మోతెక్కించారు. ఆ ఇద్దరూ సిసలైన పందెం పుంజుల్లా తలపడడం అభిమానుల్లోనూ ఉత్సాహం పెంచింది. 2020 సంక్రాంతి ఆద్యంతం రసరమ్యంగా రంజుగా సాగింది. అయితే 2021 సంక్రాంతి సన్నివేశమేంటి? అన్నది ఆరా తీస్తే ఆసక్తికర సంగతులే తెలిసాయి.

2020 సంక్రాంతి ఫుల్ కిక్కిచ్చింది. అంతకు మించి 2021 సంక్రాంతి కిక్ ని ఇవ్వబోతోంది. ఎందుకంటే 2021 సంక్రాంతి ఫైట్ మహేష్- పవన్ కల్యాణ్ – ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్ల మధ్య ఉండనుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్న ఎంబీ 27 చిత్రం 2021 సంక్రాంతి కి రిలీజయ్యే ఛాన్సుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వం వహిస్తున్న పీ.ఎస్.పీ.కే 27 వచ్చే సంక్రాంతి రేసులోనే నిలవనుందని తెలుస్తోంది. ఆ ఇద్దరి తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వం లో తెరకెక్కనున్న సినిమా రిలీజ్ కానుంది. `అరవింద సమేత` తర్వాత తారక్ తో త్రివిక్రమ్ కమిట్ మెంట్ ని ఫుల్ ఫిల్ చేస్తున్నాడు. 2021 సంక్రాంతి బరిలో దిగేందుకే ఆ ఇద్దరూ ప్లాన్ చేస్తున్నారట.

సూపర్ స్టార్ మహేష్ .. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మధ్య హోరాహోరీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. ఆ ఇద్దరి సినిమాలు ఒకే డేట్ కి రిలీజవుతున్నాయి అంటే ఇక ఫ్యాన్స్ లో వార్ పరాకాష్ట కు చేరుకుంటుంది. ఇక వీళ్లకు ధీటుగా యంగ్ యమ ఎన్టీఆర్ కూడా బరిలోకి వస్తున్నాడు అంటే సంక్రాంతి పందెం లో ముక్కోణపు పోటీకి తెర లేచినట్టే. మావాడు గొప్ప అంటే మావాడు గొప్ప అంటూ సోషల్ మీడియాల్లో అభిమానుల మధ్య యుద్ధ వాతావరణానికి తెర లేస్తుంది. 2020 సంక్రాంతి తరహా లోనే పోస్టర్ వార్ మరోసారి రిపీట్ కావడం ఖాయం. సోషల్ మీడియా యుగం లో ఇది గొప్ప ప్రచారానికి ఆస్కారం కల్పిస్తోంది. అయితే ఫ్యాన్స్ సంయమనం తో ఈ వార్ ని హెల్దీగా ఉంచేందుకు ఛాన్సుంటుందేమో!
Please Read Disclaimer