‘సరిలేరు’ డబుల్ ధమాకా !

0

మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ నుండి దీపావళి అప్డేట్ వచ్చేసింది. రేపు ఉదయం ఒక పోస్టర్ అలాగే సాయంత్రం మరో పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించేసారు. అందులో కీలక పాత్ర పోషిస్తున్న విజయ శాంతి క్యారెక్టర్ కి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ఒకటి కాగా మరొకటి మహేష్ స్టిల్ తో కూడిన పోస్టర్.

రేపు ఉదయం సరిగ్గా తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు విజయ శాంతి ఇంట్రడక్షన్ పోస్టర్ రిలీజ్ చేసి సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు మహేష్ స్టిల్ తో దీపావళి కనుక అందించబోతున్నారు.

ఇక రేపు ఉదయం నుండి సాయంత్రం వరకూ విజయ శాంతి పోస్టర్ హంగామా చేస్తే సాయంత్రం నుండి మహేష్ ఆ ప్రమోషన్స్ ను పోస్టర్ తో కంటిన్యూ చేస్తాడన్నమాట. ఈ రెండు పోస్టర్స్ ఎలా ఎట్రాక్ట్ చేస్తాయో..చూడాలి.