ఇంతకీ లక్ష్మీస్ ఎన్టీఆర్ వస్తున్నట్టా రానట్టా?

0

గత రెండు నెలలుగా ఎడతెగకుండా లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రమోషన్ చేస్తున్న రామ్ గోపాల్ వర్మ ఇంకాస్త దూకుడు పెంచాడు. టీవీ ఇంటర్వ్యూలు వరసబెట్టి గుప్పించేస్తున్నాడు. ఏ మీడియా ఛానల్ అడిగినా కాదనకుండా స్టూడియోకు వెళ్ళిపోతున్నాడు. అంతా బాగానే ఉంది కానీ ఇంతకీ 29న అసలు సినిమా విడుదల అవుతుందా లేదా అనే దాని గురించి ఇంకా మబ్బులు వీడిపోలేదు.

అసలు సెన్సార్ ఏమంటున్నారో ప్రక్రియ ఎంత దాకా వచ్చిందో ఏ సమాచారమూ లేదు. 29న రావాలి అంటే ఈపాటికి ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిపోయి ఉండాలి. కానీ సెన్సార్ అధికారులు ఇంకా ఫైనల్ వెర్షన్ చూడనే లేదని సమాచారం. ఇంకో రెండు రోజుల్లో ఉండొచ్చని టాక్. కారణం లేకపోలేదు. వర్మ టీమ్ దరఖాస్తు చేసిన తేదీ ప్రకారం అదే వరసలో వస్తుందట. మిగిలిన వాటిని పక్కన పెట్టి యుద్ధ ప్రతిపాదికన ఇది చూసేయమని కోర్టు కూడా చెప్పలేదు. అంతా రూల్స్ ప్రకారం జరిగిపోవాల్సిందే

ఇక్కడ వర్మ జాగ్రత్త పడకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. విడుదల తేదీని ముందే ప్రకటించి నిబంధనల ప్రకారం కాకుండా లోపాయికారిగా చివరి నిమిషంలో సెన్సార్ చేయించడం పెద్ద నిర్మాతలు పాటించే ఎత్తుగడే. కానీ ఏకంగా ఎన్నికల కమీషన్ దృష్టిలో ఉన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ కు లీగల్ గా సమస్యలు రాకూడదు అనే ఉద్దేశంతో సెన్సార్ బోర్డు అన్ని పక్కాగా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తోందట.

ఈ లెక్కన కేవలం 6 రోజుల వ్యవధిలో ఇదంతా కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు. అప్పుడు వర్మ నా తప్పేమి లేదు సెన్సార్ లేట్ చేసిందని ఇంకో డేట్ అనౌన్స్ చేస్తాడు. సో లక్ష్మీస్ ఎన్టీఆర్ 29న చూసేద్దాం అని ప్లాన్ చేసుకున్న వాళ్లకు నిరాశచెందే అవకాశాలు లేకపోలేదు. వేచి చూడటం మినహా ఎవరైనా చేయగలిగింది ఏమి లేదు.
Please Read Disclaimer