డ్రీం గర్ల్ ట్రైలర్ టాక్

0

రెగ్యులర్ కమర్షియల్ హీరోలకు భిన్నంగా ఎవరికి అంతు చిక్కని కథలు పాత్రలతో దూసుకుపోతున్న ఆయుష్మాన్ ఖురానా కొత్త చిత్రం డ్రీం గర్ల్. దీని ట్రైలర్ ఇందాకా రిలీజ్ చేశారు. బాలాజీ పిక్చర్స్ బ్యానర్ పై రాజ్ శాండిల్య దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ హాస్య ప్రియులను టార్గెట్ చేసుకుంది. ఇదో వెరైటీ కథ.

అబ్బాయి(ఆయుష్మాన్ ఖురానా)గా పుట్టినా లోలోపల స్త్రీల తాలూకు ఫీలింగ్స్ ఎక్కువగా ఉండే ఓ యువకుడు సమయం దొరికినప్పుడంతా తన ఆకాంక్షను డ్రామాల్లో సీత లాంటి పాత్రలు వేయడం ద్వారా తీర్చుకుంటూ ఉంటాడు. పైకి మాత్రం మాములుగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇతనికో లవర్(నస్రత్ భరూచా)కూడా ఉంటుంది.

నాన్న(అనూ కపూర్)ఎంత చెప్పినా పద్ధతి మార్చుకోడు. ఈ లోగా కస్టమర్ కేర్ తరహాలో తన పేరు పూజాగా మార్చుకుని అబ్బాయిలను ట్రాప్ లో వేయడం మొదలుపెడతాడు. ఇది నిజమని నమ్మిన ఓ అమాయకుడు ఏకంగా లవ్ లో పడతాడు. ఆ తర్వాత చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ ఆడ ఫీలింగ్స్ ఉన్న ఈ మగాడి కథే డ్రీం గర్ల్

ఇది పూర్తిగా ఆయుష్మాన్ ఖురానా వన్ మ్యాన్ కం విమెన్ షో. ఇప్పటిదాకా చేయని కామెడీ పాత్రలో చెలరేగిపోయాడు. ఇటీవల చూసిన ఆర్టికల్ 15లో హీరో ఇతనేనా అనిపించేలా టైమింగ్ తో అదరగొట్టేశాడు. చాలా క్లిష్టమైన పాత్రను ఈజ్ తో చేసుకుంటూ పోయాడు. క్యాస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా కుదరడంతో దర్శకుడు రాజ్ పని సులభమైపోయింది. ప్రొడక్షన్ వేల్యూస్ మ్యూజిక్ అన్ని థీమ్ కు తగ్గట్టు ఉన్నాయి. అవుట్ అండ్ అవుట్ కామెడీ జానర్ లో రూపొందిన డ్రీం గర్ల్ ఇప్పటిదాకా ఆ బిరుదు అంకితమైపోయిన హేమమాలిని నుంచి లాక్కునేలా ఉంది
Please Read Disclaimer