ఈ ఏడాది ప్రభాస్ సినిమా లేనట్లే… నా?

0

కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటినీ తన గుప్పిట్లో పెట్టుకుంది. ఎక్కడ చూసినా కరోనా భయంతో ప్రజలు వణికిపోతున్నారు. కరోనా ప్రభావంతో దేశంలోని సామాన్య ప్రజలతో పాటు సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీల పై కూడా విపరీతంగా ఉంది. కరోనా వల్ల రీసెంట్ గా చిత్రసీమలో షూటింగ్ జరుపుకుంటున్న చిత్రాలన్నీ షూటింగ్ నిలిపేశాయి. ఇక అందులో భాగంగానే ఇటీవల డార్లింగ్ ప్రభాస్ కూడా తన 20వ సినిమా షూటింగ్ ఆపేసి ఇంట్లో కూర్చున్నాడు.

ఇదిలా ఉండగా.. కరోనా కారణంగా ఈ నెల 31వరకు సినిమా థియేటర్లు కూడా మూసివేయడం జరిగింది. మరి కరోనా బారినుండి తప్పించుకోవడానికి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను లాక్ డౌన్ చేసింది. ఈ పరిస్థితిలో అసలు కరోనా పరిస్థితులు చక్కబడేది ఎప్పుడు.. మేం షూటింగులు పూర్తిచేసేది ఎప్పుడనే.. సందేహాలతో ప్రభాస్ చిత్రయూనిట్ వాపోతున్నట్లు సమాచారం. ఇక ఇదే తంతు గనక కంటిన్యూ అయితే దేశంలోని అన్ని సినిమాలు ఆపేసి ఇంట్లో కూర్చోవడమే దిక్కుగా కన్పిస్తుంది.

దీన్ని బట్టి ప్రభాస్ 20వ సినిమా ఇప్పట్లో పూర్తికాదని అర్ధమవుతుంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా పై సినీ ప్రేక్షకులు భారీ ఆశలనే పెట్టుకున్నారు. ఈ కరోనా నుండి బయటపడేది ఎప్పుడో తెలీదు కనుక ఈ సినిమా షూటింగ్ కూడా ఈ ఏడాది పూర్తికాదు కావచ్చు అని చిత్రవర్గాలు భావిస్తున్నాయి. తాజా పరిణామాలను గమనిస్తే ఈ సినిమాను వచ్చే ఏడాది రావడం ఖాయమని అనుకుంటున్నారు సినీ విశ్లేషకులు. చూడాలి మరి ఏం జరగనుందో..
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-