నలుపు డ్రెస్ లో నలిపేస్తోందే

0

బాలీవుడ్ లో హాటు భామల లిస్టు చాలా పెద్దదే. ఆ లిస్టులో ఉన్న ఒక భామ యామి గౌతమ్. ఈ బ్యూటీ తెలుగులో కూడా పలు సినిమాలలో నటించింది. ‘నువ్విలా’.. ‘గౌరవం’.. ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ లాంటి సినిమాల్లో నటించింది. హిందీలో చాలా సినిమాల్లో నటించిన ఈ భామ రీసెంట్ గా ‘ఉరి:ది సర్జికల్ స్ట్రైక్’.. ‘బాలా’ లాంటి హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక సోషల్ మీడియాను ఒక ఆట ఆడుకోవడం ఈ భామకు భలే అలవాటు.

యామి ఈమధ్యనే ఫిలిం ఫేర్ గ్లామర్ & స్టైల్ అవార్డుల కార్యక్రమానికి హాజరయింది. గ్లామర్ అవార్డులు కాబట్టి గ్లామరస్ గా కనిపించడం ఒక బేసిక్ రూల్. అందుకే యమా గ్లామరస్ గా కనిపించేలా ఓ కత్తిలాంటి నలుపు రంగు డ్రెస్ వేసుకుంది. ఆ డ్రెస్ లో ఫోటో షూట్ లో కూడా పాల్గొంది. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. సూట్ డిజైన్ లో ఉండే గౌన్ కు ఎంబ్రాయిడరీ వర్క్ ఉండడంతో రిచ్ లుక్ వచ్చింది. డ్రెస్ కు ఉండే డీప్ వీ నెక్ కారణంగా గ్లామరసం ఒలికిపోయింది! మేకప్.. బ్రైట్ లైటింగ్ తో ఫేస్ లో కూడా చాలా గ్లో కనిపిస్తోంది.

ఈ ఫోటోలకు గ్లామర్ ఆరాధకులు కామెంట్ల వర్షం కురిపించారు. “యమ్మి లుక్ యామి”.. “ఝకాస్ డ్రెస్.. లవ్లీ”.. “ఆ గ్రేస్ సూపర్” అంటూ కామెంట్లు పెట్టారు. ఇక యామి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ‘జిన్నీ వెడ్స్ సన్నీ’ అనే రొమాంటిక్ కామెడీలో నటిస్తోంది. ఈ సినిమాలో విక్రాంత్ హీరోగా నటిస్తున్నాడు.
Please Read Disclaimer