బాబి బావ నువ్వు సూపరన్న చెస్ బ్యూటీ

0

వెంకటేష్-నాగచైతన్య కథానాయకులుగా బాబి దర్శకత్వం వహించిన వెంకీమామ ఇటీవల విడుదలై సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. రివ్యూలు అనుకూలంగా లేకపోయినా మాస్ ఆడియన్స్ కు సినిమా బాగా రీచ్ అయింది. సినిమాలో కామెడీ వర్కౌట్ అవ్వడంతో మామ-అల్లుళ్లు సేఫ్ గా బయటపడ్డారు. ఈ సక్సెస్ తో లెజెడరీ రామానాయుడు ఆత్మకు ఘన నివాళి దక్కింది. మహేష్ బాబు లాంటి టాప్ స్టార్లు సినిమా చూసి ప్రశంసించారు. దీంతో యూనిట్ ఘనంగా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ప్రస్తుతం మామ-అల్లుడు రెట్టించిన ఉత్సాహం లో ఉన్నారు.

కొత్త సంవత్సరంలో కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రణాళికలు వేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది డైరెక్టర్ బాబి అలియాస్ కె.ఎస్ రవీంద్ర. తనదైన దర్శకత్వ శైలితో.. అద్భుత కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో నూరుశాతం సక్సెస్ అయ్యాడు. దీంతో బాబి కి మంచి పేరు వచ్చింది. ఈ సక్సెస్ చూసి బాబి మరదలు బావను తెగ పొగిడేసింది. ఆనందం పట్టలేక సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని షేర్ చేసుకుంది. అంతగా బావపై అభిమానం కురిపించేసిన ఆ మరదలు ఎవరు.. అంటారా?

ఆమె ఎవరో కాదు అంతర్జాతీయ చెస్ ఛాంఫియన్ ద్రోణ వల్లి హారిక. హారిక అక్క అనూష నే బాబి వివాహం చేసుకున్నాడు. అలా హారిక బాబికి మరదలైంది. ఇప్పుడిలా బావ ప్రతిభను మరదలు ప్రశంసించింది. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది బావ! అని ట్వీట్ చేసింది హారిక. ఈ ట్వీట్ చూసిన బాబి మరదలకు కృతజ్ఞతలు తెలిపాడు. మరి బాబి కొత్త సంవత్సంలో ఏ హీరోతో సినిమా చేస్తాడు అన్న వివరాలు మాత్రం ఇంకా రివీల్ చేయలేదు.
Please Read Disclaimer