డ్రగ్స్ కేసు : స్టార్ ప్రొడ్యూసర్ ని కూడా విచారించనున్నారా…?

0

బాలీవుడ్ డ్రగ్స్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసుపై ఫోకస్ పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) సెలబ్రిటీలు మరియు వారి మేనేజర్లను విచారిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన ఎన్సీబీ.. నిన్న రకుల్ ప్రీత్ సింగ్ మరియు దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్ లను విచారించింది. ఈ రోజు స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకునే – శ్రద్ధాకపూర్ – సారా అలీఖాన్ లను విచారించింది. వీరితో పాటు ధర్మ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్ ను నిన్నటి నుంచి విచారిస్తున్నారు. ఈ క్రమంలో అతని ఇంట్లో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించగా గంజాయి మరియు చిన్న మొత్తంలో వీడ్ దొరికినట్లు తెలుస్తోంది. అయితే ఎన్సీబీ విచారణలో అతను చెప్పిన విషయాలు సంతృప్తికరంగా లేకపోవడంతో 24 గంటల విచారణ అనంతరం క్షితిజ్ ప్రసాద్ ని అరెస్ట్ చేశారు.

కాగా ఎన్సీబీ విచారణలో క్షితిజ్ ఐదుగురు బాలీవుడ్ సెలబ్రిటీలు మరియు ఇద్దరు నిర్మాతల పేర్లు వెల్లడించాడని.. వారి పేర్లు గోప్యంగా ఉంచిన ఎన్సీబీ అధికారులు త్వరలోనే మరికొందరికి సమన్లు జారీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో 2019లో కరణ్ జోహార్ ఇచ్చిన పార్టీపై కూడా ఎన్సీబీ అధికారులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలోనే కరణ్ జోహార్ కి ఎన్సీబీ సమన్లు జారీ చేయనుందని CNN న్యూస్18 కథనం ప్రసారం చేసింది. అయితే కరణ్ జోహార్ తనపై వస్తున్న వార్తలను ఖండిస్తూ కరణ్ ఓ లేఖ విడుదల చేశారు. ‘అనుభవ్ చోప్రా – క్షితిజ్ ప్రసాద్ వ్యక్తిగత జీవితాలతో నాకు ధర్మ ప్రొడక్షన్స్ కు ఎలాంటి సంబంధమూ లేదు. ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదు. డ్రగ్ డీలర్స్ ఎవరితోనూ సంప్రదింపలు జరపలేదు’ అని కరణ్ జోహార్ పేర్కొన్నాడు.