తాగి దొరికిన హీరో ముఖం చాటేశాడు

0

పొగ తాగనివాడు దున్నపోతై పుట్టును! అన్నారు గిరీశం. మందు తాగని వాడు అసలు మగాడే కాదు!! అంటోంది ఈ సమాజం. ప్రస్తుత సంఘంలో ఇదోరకం వింత. పార్టీకి వెళితే మందు తాగకపోతే కుదురుతుందా? ఫ్లూటుగా తాగి చిందులేసి వస్తేనే మజా! అయితే సెలబ్రిటీ కల్చర్ లో మందు మాకు లేనిదే అస్సలు రాత్రి గడవదు. ఫుల్లుగా పెగ్గేసి స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ ఆ మత్తు దిగేదాకా కిక్కును ఆస్వాధిస్తే కానీ కసి తీరదు.

అయితే ఇలా చేసి చాలా మంది ఫ్లైవోవర్లను గుద్ది.. దారిన పోయేవాళ్లను ఢీకొట్టి నానా యాగీ చేస్తుండడం చూస్తున్నదే. మత్తు ఎక్కాక కార్ ఎటువైపు పోతోందో కూడా తెలీని సన్నివేశం ఉంటుంది. అందుకే హైదరాబాద్ పోలీస్ ఇటీవలి కాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో స్పెషల్ మిషన్ చేపట్టారు. ఈ మిషన్ లో తాగి దొరకని సెలబ్రిటీ లేడంటే అతిశయోక్తి కాదు. పొగ తాగడం ప్రమాదం.. తాగి డ్రైవ్ చేయడం ఇంకా ప్రమాదం! అంటూ నీతులు దంచేసే హీరోలు సైతం డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయిన సందర్భాలున్నాయి. జూబ్లీ హిల్స్ కేబీఆర్ పార్క్ చుట్టూ మాటు వేస్తే చాలు ఎట్నుంచి పోయే సెలబ్రిటీ అయినా ఈజీగా పోలీసులకు దొరికిపోతాడు. పబ్బులు.. క్లబ్బులు నుంచి బయటికి వచ్చే బాపతు ఎటు వెళతారో తెలుసుకుని మరీ పోలీసులు మాటు వేస్తున్నారు.

అలా ఇప్పటికే ఎందరో సినీహీరోలు.. ప్రముఖ దర్శకులు నిర్మాతలు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయారు. ఆనక ముఖం చాటేసి మీడియాకి దొరక్కుండా తప్పించుకునేందుకు ప్రయత్నించడం బయటపడింది. ఇక ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో తాజాగా యువహీరో ప్రిన్స్ పట్టుబడి కోర్టు గడప తొక్కడం యువతరంలో చర్చకు వచ్చింది. అతడు తాగి కార్ నడిపాడు. దీంతో పోలీసులు కేసు బుక్ చేసి కూకట్ పల్లి కోర్టులో హాజరుపరిచారు. మొత్తానికి పరిహారం చెల్లించి బయటపడుతున్నా కోర్టు ఆవరణలో అతడు ఏం చేశాడో ప్రతిదీ ఫోటోల రూపంలో బయటపడిపోవడంతో అవి కాస్తా వైరల్ గా మారాయి. ఇలా తప్పు చేసి దొరికిపోయిన ప్రిన్స్ తనని తాను కవర్ చేసుకునేందుకు నానా తంటాలు పడ్డాడని ఆ ఫోటోలే చెబుతున్నాయి. భుజాలమీదుగా మంకీ క్యాప్ ఉన్న గళ్ల చొక్కాని తొడుక్కున్న అతడు క్యాప్ తో ముఖాన్ని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే కెమెరా కళ్లు అతడిని పసిగట్టి ఫోటోలతో మోతెక్కించాయి. అతడి వెనకనే లాయర్లు కనిపించడంతో అది కోర్టు ప్రాంగణం అని స్పష్టంగా అర్థమవుతోంది. తాగి దొరికితే ఎన్ని పాట్లో కదా!

తేజ దర్శకత్వంలో ‘నీకు నాకు డాష్ డాష్’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ప్రిన్స్ బస్ స్టాప్నే- ను శైలజ లాంటి హిట్ చిత్రాల్లో నటించాడు. బిగ్ బాస్ సీజన్ 1 లో ఇంటి సభ్యునిగానూ చేరాడు. ప్రస్తుతం సినీకెరీర్ అంతంత మాత్రమే. కంబ్యాక్ కోసం అతడు చాలానే హార్డ్ గా ట్రై చేస్తున్నాడట. మరోవైపు ప్రిన్స్ కి క్రికెట్ ఆటగాడిగానూ ఫ్యాన్స్ లో గుర్తింపు ఉంది. దీంతో సీసీఎల్ క్రికెట్ లోనూ అతడు మెరిపిస్తున్నాడు.
Please Read Disclaimer