పవన్ కళ్యాణ్ 27లో డ్యూయెల్ రోల్స్.. నిజమేనా?

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం రాజకీయాలు పక్కన పెట్టి వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలలోకి రావడంతో ఆయన అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ట్రాక్ లో ఉండగానే డైరెక్టర్ క్రిష్ తో మరో సినిమాను ఓకే చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ 27వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో రూపొందించడానికి పూనుకున్నారు దర్శకనిర్మాతలు.

ఇప్పటికే సినిమా గురించి ఒక్కో విషయాన్నీ చిత్రయూనిట్ బయటపెడుతున్నారు. స్వాతంత్య్రం ముందు జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించనున్నాడట. అయితే ఈ సినిమా గురించి తాజాగా మరో గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డబల్ రోల్ లో దర్శనమియనున్నాడట. ఈ విషయం తెలిసిన వెంటనే పవర్ స్టార్ అభిమానులలో ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. అధికారికంగా ప్రకటించినప్పటికీ డైరెక్టర్ క్రిష్ మాత్రం పవన్ కళ్యాణ్ ను ఇంతవరకు చూడని విధంగా చూపించనున్నాడని సమాచారం. మరి ఈ విషయం పై త్వరలో చిత్రయూనిట్ ఎలా స్పందించనుందో వేచిచూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-