1997 నాటి సినిమాకు ఇప్పుడు రీమేక్?

0

తమిళ స్టార్ హీరోలు అజిత్.. విక్రమ్ కలిసి నటించిన మల్టిస్టారర్ ఫిలిం ‘ఉల్లాసం’. ఈపేరు ఎప్పుడూ వినలేదే అనుకోకండి. ఇది 1997 లో రిలీజ్ అయిన సినిమా.. 22 ఏళ్ళయింది కాబట్టి ఈ జెనరేషన్ వారికి ఈ సినిమా గురించి తెలిసి ఉండే అవకాశం తక్కువ. ఇప్పుడు ఈ సినిమా ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఈ సినిమాను రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట.

ఈ సినిమాకు జేడీ & జెర్రీ ద్వయం దర్శకత్వం వహించారు. కార్తిక్ రాజా అందించిన మ్యూజిక్ తో సూపర్ హిట్ ఆల్బం గా నిలిచింది. తమిళంలో సినిమా పర్వాలేదనిపించుకుంది కానీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. రీసెంట్ గా ఈ సినిమాను యంగ్ హీరోలతో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని జేడీ & జెర్రీ ప్రకటించారు. ఈ సినిమాలో విక్రమ్ పాత్రలో యువ నటుడు విక్రమ్ ప్రభు.. అజిత్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తారని అంటున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందట.

ఈ సినిమాకు ఒరిజినల్ దర్శకులు జేడీ & జెర్రీ దర్శకత్వం వహిస్తారట. ఈ సినిమా స్టొరీలైన్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అయితే ఈ జెనరేషన్ ఆడియన్స్ కు తగ్గట్టు మార్పుచేర్పులు చేస్తే కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి అప్పటి డైరెక్టర్లు ఇప్పటి ఆడియన్స్ పల్స్ ను పట్టుకోగలరా లేదా అనేది వేచి చూడాలి.
Please Read Disclaimer