ప్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన మలయాళ హీరో

0

‘అందాల రాక్షసి’ ‘పడి పడి లేచే మనసు’లాంటి మనసుని హత్తుకొనే చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు హను రాఘవపూడి. తన మొదటి చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరైనప్పటికీ తర్వాత కాలంలో వచ్చిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ మినహా మిగతా సినిమాలు అంతగా ప్రభావం చూపలేకపోయాయనే చెప్పాలి. మొన్నటిదాకా బాలీవుడ్లో సన్నీడియోల్తో కలిసి యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే లేటెస్ట్ గా హను రాఘవపూడికి సంభందించిన మరో వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ డైరెక్ట్ తెలుగులో నటించబోయే సినిమాకి దర్శకత్వ బాధ్యతలు హను రాఘవపూడికి దక్కినట్లు సమాచారం.

మలయాళంలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న దుల్కర్ సల్మాన్ మహానటి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన కొన్ని సినిమాలు తెలుగులోకి డబ్ కూడా అయ్యాయి. ఈ మధ్య విడుదలయిన ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రం ద్వారా మంచి విజయాన్ని సొంతం చేసుకొని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. అప్పటి నుంచి నేరుగా ఓ తెలుగు సినిమా చేయాలని ఎదురు చూస్తున్న దుల్కర్ సల్మాన్ కు హను రాఘవపూడి చెప్పిన స్క్రిప్ట్ నచ్చినట్లు సమాచారం. దుల్కర్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళం తమిళ్ లో కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. హిట్టు సినిమాలు తీసిన దర్శకులకే స్టార్ హీరోలు అవకాశం ఇవ్వని ఈ రోజుల్లో హను లక్కీ ఛాన్స్ కొట్టేశాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. టాలెంట్ ఉన్నా సక్సెస్ లేని తెలుగు దర్శకుల్లో హను రాఘవపూడి మొదటి వరుసలో ఉంటాడు. ఫ్లాప్ డైరెక్టర్గా ముద్ర పడిన హను రాఘవపూడి ఈ చిత్రం ద్వారా అయినా క్రేజీ దర్శకుల్లో ఒకడిగా నిలిచి పోతాడో లేదో చూడాలి మరి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-