భాఘి 3 సాంగ్: స్టెప్పు స్టెప్పుకో కొత్త బికినీ

0

`సాహో`.. చూశాక శ్రద్ధా మరీ ఇంత బుద్ధిగా ఉందేమిటో! అని కన్ఫ్యూజ్ అయ్యారంతా. ఇక్కడ అంత పద్ధతిగా కనిపించిన ఈ అమ్మడు బాలీవుడ్ లో మాత్రం అందాల ఆరబోతకు ఏనాడూ అడ్డు చెప్పలేదు. ఇటీవలే రిలీజైన `స్ట్రీట్ డ్యాన్సర్ 3డి` ఆద్యంతం శ్రద్ధా అందాల ట్రీట్ కుర్రకారుకు మతి చెడగొట్టింది. రెమో- ప్రభుదేవా ల స్టైలిష్ కొరియోగ్రఫీకి తగ్గట్టే డ్యాన్సులు చేస్తూ శ్రద్ధా చిట్టి పొట్టి దుస్తుల్లో అదరగొట్టింది.

ప్రస్తుతం ఈ భామ నటిస్తున్న `భాఘి 3` రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. మార్చిలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఆ క్రమంలోనే ప్రచారంలో వేగం పెంచింది టీమ్. ఇటీవలే భాఘి 3 పోస్టర్లు అంతర్జాలంలో హాట్ టాపిక్ గా మారాయి. టైగర్ ష్రాఫ్- శ్రద్ధా జంట స్టన్నింగ్ లుక్ కి.. ఘాటైన రొమాన్స్ కి అద్భుత స్పందన వచ్చింది. తాజాగా రిలీజైన `దస్ బహానే 2.0` సాంగ్ లో మరోసారి శ్రద్ధా చెలరేగిపోయింది.

ఈ పాట ఆద్యంతం స్టెప్పు స్టెప్పుకో కొత్త బికినీతో అదరగొట్టింది. రెడ్ .. బ్లూ.. వయోలెట్ ఇలా డిఫరెంట్ బికినీల్ని ధరించిన శ్రద్ధ టోన్డ్ బాడీని.. థై సొగసుల్ని ఎలివేట్ చేసేందుకు ఏమాత్రం మొహమాట పడలేదు. అడుగడుగునా చిట్టి పొట్టి దుస్తుల్లో వేడెక్కించింది. మరోవైపు టైగర్ ష్రాఫ్ 8 ప్యాక్ బాడీని చూపించి ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ అయ్యాడు. ప్రస్తుతం ఈ సాంగ్ యూత్ సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అయిపోతోంది. ఇటీవలే దిశా పటానీ `మళంగ్` టైటిల్ సాంగ్ లో బికినీ ట్రీట్ ని మరువక ముందే శ్రద్ధా బికినీ ట్రీట్ హాట్ టాపిక్ గా మారింది. టైగర్ మాజీ ప్రేయసిని కొట్టేలా దిశా చెలరేగిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. భాఘి- భాఘి 2 సంచలన విజయాలు సాధించాయి. భాఘి 2లో మాజీ ప్రేయసి దిశా పటానీతో టైగర్ రొమాన్స్ పెద్ద రేంజులో వర్కవుటైంది. ఈ ఫ్రాంఛైజీ మూడో సినిమా భాఘి 3కి అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. పార్ట్ 3 విజయం సాధించేందుకు టైగర్ – శ్రద్ధా జోడీ ఏమేరకు అస్సెట్ అవుతుందో చూడాలి.