బికినీ బేబ్ 90 డిగ్రీల సెల్ఫీ ట్రీట్

0

నల్లకలువ బిపాసా గురించి పరిచయం అవసరం లేదు. ‘టక్కరి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఈ బ్యూటీ సుపరిచితం. ఆ సినిమాలో అందాల బిపాసా ట్రీట్ ని మహేష్ అభిమానులే కాదు తెలుగు సినీప్రేమికులు ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. ధూమ్ 2లోనూ బిపాసా బికినీ ట్రీట్ ని మర్చిపోవడం కష్టమే.

ఇక బాలీవుడ్ లో రాజ్- రాజ్ 3- జిస్మ్- ఎలోన్ లాంటి హారర్ థ్రిల్లర్లతో ఫ్యాన్స్ గుండెల్లో గుబులు పుట్టించింది. అందానికి అందం.. ప్రతిభ బిపాసా సొంతం. అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే ఈ అమ్మడు జాన్ అబ్రహాం నుంచి విడిపోవడం అటుపై డిప్రెషన్ లోకి వెళ్లడం తెలిసిందే. అటుపై టీవీ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ తో ప్రేమలో పడి కొన్నాళ్లకు పెళ్లాడింది. ప్రస్తుతం ఈ జంట ఆదర్శ జంటగా హిందీ టీవీ పరిశ్రమలోనూ బిజీగా ఉన్నారు.

ఇకపోతే ఇటీవల ఈ భామ సినిమాలేవీ చేయకపోవడంతో.. గర్భిణి అంటూ ప్రచారమైంది. అయితే దానిపై మీడియా ప్రశ్నించినా ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. తాజాగా బిప్స్ బికినీ బీచ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటో ఒకటి అంతర్జాలంలో రివీలైంది. 90 డిగ్రీల కోణంలో వేడెక్కించే సెల్ఫీతో బిప్స్ ఇచ్చిన ట్రీట్ కి పరేషాన్ అవ్వాల్సిందే. బ్లాక్ బికినీలో తడిపొడి అందాలతో టోన్డ్ బాడీతో మత్తెక్కించింది. డార్క్ లిప్స్ తో బిప్స్ కవ్వింత వైరల్ గా దూసుకుపోతోంది.
Please Read Disclaimer