అభిమానుల్ని ఖుషీ చేసిన స్టార్ హీరోలు

0

ఒక రోజు ముందే తమ అప్ కమింగ్ సినిమాలకు సంబంధించి పోస్టర్స్ వదిలి అభిమానులకి దసరా శుభాకాంక్షలు తెలిపారు స్టార్ హీరోలు. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా నుండి కొండారెడ్డి బురుజు దగ్గర గొడ్డలి పట్టుకొన్న పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ అందరికీ ఒక్కడు సినిమాను గుర్తుకు తెచ్చింది.

అల్లు అర్జున్ కూడా తన ‘అల వైకుంఠపురములో’ నుండి ఓ పోస్టర్ వదిలి దసరా శుభాకాంక్షలు తెలిపాడు. స్టేడియంలో ఓ క్లాత్ చేతికి కాలికి చుట్టుకొన్న బన్నీ స్టిల్ అందరినీ ఎట్రాక్ట్ చేసింది. ఇక ఇదే స్పీడ్ మీద నందమూరి బాలయ్య కూడా తన సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ నుండి ఓ స్టిల్ తో దసరా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ వదిలాడు. బన్నీ చుట్టూ దెబ్బలతో పడి ఉన్న రౌడీలను చూస్తుంటే సినిమాలో ఈ యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ నిలిచేలా కనిపిస్తుంది.

నిజానికి మహేష్ బన్నీలకంటే బాలయ్య పోస్టరే ఎంతో పవర్ ఫుల్ గా ఉంది. క్లాస్ డ్రెస్ లో ఒంటి నిండా హొలీ రంగులేసుకొని చేతిలో ఓ కట్టిపట్టి దర్శనిమిచ్చాడు నందమూరి నటసింహం. ఇక రాజ్ తరుణ్ కూడా విజయ దశమి సందర్భంగా విజయం కోరుతూ ‘ఇద్దరి లోకం’ ఫస్ట్ లుక్ తో సోషల్ మీడియాలో హంగామా చేసాడు. ఇలా ముగ్గురు స్టార్ హీరోలు ఒక కుర్ర హీరో కలిసి నాలుగు పోస్టర్స్ తో అభిమానుల్లో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చి ఖుషీ చేశారు.
Please Read Disclaimer