దానయ్య వారసుడు హీరోగా.. లాంచ్ ప్రయత్నాలు

0

టాలీవుడ్ లో నటవారసులకు కొదవలేదు. హీరోల కొడుకులు.. ఇతర బంధువులు హీరోలుగా మారడం అతి సాధారణం. నిర్మాతల తనయుల విషయమే తీసుకుంటే సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ లెజెండరీ ప్రొడ్యూసర్ డీ. రామానాయుడు తనయుడు. ఈ జెనరేషన్లో బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా కొనసాగుతున్నాడు. ఈ లిస్టులో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు కూడా చేరబోతున్నాడు.

నిజానికి డీవీవీ దానయ్య తనయుడు కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడని పోయినేడాదే వార్తలు వచ్చాయి. కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా అనుకుంటున్నారని కూడా అన్నారు. అయితే ఎందుకు ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. తాజా సమాచారం ప్రకారం దానయ్య తనయుడు నటించే డెబ్యూ సినిమాకు రంగం సిద్ధం అవుతోందట. దానయ్య తన కొడుకు సినిమాను స్వయంగా నిర్మించడం కాకుండా వేరే నిర్మాత చేతిలో పెట్టాలని భావిస్తున్నాడట. ‘RRR’ ప్రాజెక్టుతో బిజీగా ఉండడం వల్ల కొడుకు డెబ్యూ సినిమాపై పూర్తిగా దృష్టి పెట్టలేరని అలా వేరే నిర్మాత చేతిలో పెట్టాలని అనుకుంటున్నారేమో తెలియదు కానీ త్వరలోనే ఈ ప్రాజెక్టు ఫైనలైజ్ అవుతుందని సమాచారం.

హీరో యాక్టివ్ గా ఎనర్జిటిక్ గా ఉంటూ.. మంచి సబ్జెక్టులు ఎంపిక చేసుకుంటే చాలు తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. అంతేకానీ వారసులా.. కొత్తవారా అనే విషయాలను పట్టించుకోరు. దానయ్య కుమారుడు కూడా ఇదే బాటలో తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నాడన్నమాట. దానయ్య కొడుకు డెబ్యూ ఫిలిం దర్శకుడు.. నిర్మాత ఎవరు అనే విషయాలు త్వరలోనే తెలుస్తాయి.
Please Read Disclaimer