నా ప్రతి సినిమాకు ఎన్టీఆర్ నుండి కాల్ వస్తుంది

0

తమిళ సూపర్ స్టార్ విజయ్ తో ఇప్పటికే రెండు సినిమాలు చేసి ఇప్పుడు మూడవ సినిమా బిగిల్ ను తెరకెక్కించిన దర్శకుడు అట్లీ కుమార్ మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోబోతున్నాడంటూ తమిళ సినీ ప్రేక్షకులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. బిగిల్ సినిమా విజయ్ మరియు అట్లీల కాంబోలో రాబోతున్న మరో సెన్షేషనల్ మూవీగా సినీ విశ్లేషకులు కూడా విశ్లేషిస్తున్నారు. బిగిల్ చిత్రాన్ని తెలుగులో ‘విజిల్’ గా డబ్బింగ్ చేసి విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర దర్శకుడు అట్లీ కుమార్ మరియు ఇతర టెక్నీషియన్స్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. నేడు జరిగిన ఈ ప్రెస్ మీట్ లో అట్లీ కుమార్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చాలా కాలంగా తెలుగు సినిమా చేయాలనే కోరికతో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అవకాశం కుదిరితే తప్పకుండా తెలుగులో సినిమా చేస్తానంటూ అట్లీ క్లారిటీ ఇచ్చాడు.

ఇదే సమయంలో నా ప్రతి సినిమా విడుదల అయిన వెంటనే బాగా తీశారు.. మంచి సినిమా చేశారు అంటూ ఎన్టీఆర్ సర్ ఫోన్ చేసి మరీ అభినందించారు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్ అంటూ చెప్పుకొచ్చాడు. అట్లీ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ తో ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది. విజిల్ ను ఇక్కడ 700 థియేటర్లకు పైగా విడుదల చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా సినిమాకు ఇక్కడ ఇంత క్రేజ్ ఉన్నందుకు అయినా నాకు ఇక్కడ ఒక తెలుగు సినిమా చేయాలని ఉంది అంటూ అట్లీ అన్నారు. దీపావళి కానుకగా రాబోతున్న విజిల్ చిత్రం డబ్బింగ్ రైట్స్ ను భారీ మొత్తానికి మహేష్ కోనేరు దక్కించుకుని విడుదల చేస్తున్నారు.
Please Read Disclaimer