ఆర్జీవీ ఇక ట్రైలర్లు అమ్ముకుంటేనే బెటర్

0

సినిమా విలువలు మారుతున్నాయా? అసలు సినిమా కాస్తా కొసరు సినిమాగా మారుతోందా? అంటే అవుననే ఏటీటీ సినిమాలు నిరూపించేట్టు ఉన్నాయి. అందునా ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లోకి వచ్చే సినిమాలపై జనాల్లో ఇలాంటి సందేహమే నెలకొంది. మొన్నటికి మొన్న 10-12 సీన్లతో 37 నిమిషాల నిడివితో `పవర్ స్టార్` అనే సినిమా చూపించాడు ఆర్జీవీ. ఈ మూవీకి 2కోట్ల మేర వసూళ్లు దక్కాయని ప్రచారమైంది. అంతకుముందు పవర్ స్టార్ ట్రైలర్ తోనూ ఆర్జీవీ సంపాదించుకున్నాడు. ట్రైలర్ చూడాలంటే రూ.25 చెల్లించాలి అన్న నిబంధనతో తొలిసారి అతడు సంచలనాలకు తెర తీసాడు. ప్రపంచంలోనే ఇలాంటి ఆలోచన మొదటిసారి చేసిన ఘనుడయ్యారు.

సినిమాని మించి ట్రైలర్ ఆదాయం తెచ్చేప్పుడు ఈ వ్యాపారమే బావుంది! అన్న చర్చా సాగుతోంది పరిశ్రమలో. దీంతో ఇకపై వర్మ ఇలాంటివి చేసుకోవడమే ఉత్తమమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వర్మ కి సినిమాలు కంటే ట్రైలర్స్ మీదనే ఎక్కువుగా డబ్బులు వస్తుంటే ఇక సినిమాలు తీయడం ఎందుకు? అంటూ సెటైర్లు పడుతున్నాయ్..! క్రియేటివిటీలో ఆయన పరాకాష్టకు చేరుకున్నారనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి!!

ఏదేమైనా కానీ.. వర్మ ఎంచుకుంటున్న ప్రతిదీ జనాల్లో ఆసక్తి ని పెంచేదే. పవర్ స్టార్ తర్వాత తాజాగా మర్డర్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తే అది ఇప్పుడు ట్రేండింగ్ లో ఉండటమే ఇందుకు నిదర్శనం..! ఒక్క డైలాగ్ కూడా లేకుండా ట్రైలర్ వదిలేసిన వర్మ గురించి ఏమని చెప్పాలి. సినిమా కి కొలతలు వేసుకొని పని చేసే నేటి డైరెక్టర్స్ వర్మ నుంచి నేర్చుకోవాల్సింది కూడా ఇదేనా? అంటే ఏమో!! ట్రైలర్లు అమ్ముతాడు. డైలాగుల్లేని ట్రైలర్లు రిలీజ్ చేస్తాడు. జనంలోకి దూసుకొస్తాడు. డబ్బులు కొల్లగొడతాడు. సినిమా తీసానని లఘు చిత్రాల్ని కూడా క్యాష్ చేసుకుంటాడు. ఎంతైనా వర్మ మొనగాడేనని ముచ్చటించుకుంటోంది లోకం.Please Read Disclaimer