మిల్కీ ఎందుకు తప్పుకుందంటే!

0

స్టార్ హీరోయిన్ స్టాటస్ లో ఉండీ ఒక కొత్త హీరో సరసన అంగీకరించాలంటే దానికి చాలానే లెక్కలు ఉంటాయి. లాజిక్ లు వర్కువుట్ కావాల్సి ఉంటుంది. పారితోషికాలు వగైరా వగైరా ఇలాంటి వాటిని డిసైడ్ చేస్తుంటాయి. అయితే ఇలాంటి కారణమే `రాజుగారి గది 3` నుంచి మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా తప్పుకోవడానికి కారణమని ప్రచారమైంది.

కాజల్ .. తమన్నా లాంటి స్టార్లు అంగీకరించి ఆ తర్వాత వదులుకున్న ప్రాజెక్టుగా రాజుగారి గది 3 పాపులరైంది. కొత్త హీరో అశ్విన్ సరసన నటించడం ఇష్టం లేకే తమన్నా ప్రారంభోత్సవంలో పాల్గొని వదిలేసిందని చెప్పుకున్నారు. అయితే అది నిజమా? అంటే కానేకాదని ఈ యంగ్ హీరో అంటున్నారు.

హీరో అశ్విన్ మీడియాతో మాట్లాడుతూ.. “తమన్నాను తప్పించనూ లేదు. తాను తప్పుకోనూ లేదు. కాల్షీట్ల సమస్య వల్ల తప్పుకుంది!“ అని తెలివైన ఆన్సర్ ఇచ్చాడు. మిల్కీ స్థానంలో వచ్చిన అవికా అద్భుతంగా నటించిందని కితాబిచ్చాడు. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 18న సినిమా విడుదలవుతోంది. సినిమా హిట్టయితే తమన్నా నిర్ణయం రాంగ్ అయినట్టు.. ఫ్లాపైతే కరెక్టేనని మాట్లాడుకుంటారంతా. అసలింతకీ తమన్నా ఎందుకు తప్పుకుంది? అన్నది తనే చెప్పాల్సి ఉంటుంది.
Please Read Disclaimer