తొలి వారంలో టీజర్ల దుమారం

0

ఫ్యాన్స్ కి ముందుంది ముసళ్ల పండగ! ఇన్నాళ్లు ఏదీ టీజర్.. ఏదీ ట్రైలర్.. ఎక్కడ విజువల్ ట్రీట్ అంటూ ఆత్రపడిన అభిమానులకు కరువు తీరే పండుగ ముందుంది. డిసెంబర్ తొలి వారంలో వరుస టీజర్లు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- సుప్రీం హీరో సాయి తేజ్- మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఉండనుంది. కళ్లప్పగించే విజువల్ ఫెస్టివల్ కి ఫ్యాన్స్ సిద్ధం కావాల్సి ఉందిక.

ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ – అనీల్ రావిపూడి బృందం సరిలేరు నీకెవ్వరు ట్రీట్ ని ఖాయం చేశారు. ప్రతి సోమవారం మాస్ ఎంబీ పాటల ట్రీట్ ఉంటుందని ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 2 .. సోమవారం నుంచి స్పెషల్ ట్రీట్ మొదలైనట్టే. ఇక మహేష్ టీజర్ తో పాటు అదే రోజు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో టీజర్ ట్రీట్ ఉంటుందని తెలిసింది. ఒకవేళ అదే రోజు రాకపోయినా .. ఆ మరుసటి రోజు అయినా బన్ని ట్రీట్ ఉంటుందట. ఈ రెండు టీజర్లు ష్యూర్ షాట్ గా ట్రెండింగ్ లో ఉంటాయనడంలో సందేహం లేదు.

ఇద్దరు పెద్ద హీరోల టీజర్ల సందడి ముగిసే సమయానికి సుప్రీం హీరో సాయి తేజ్ ట్రీట్ ఉంటుంది. సాయి తేజ్ – రాశీ ఖన్నా జంటగా మారుతి తెరకెక్కిస్తున్న `ప్రతి రోజు పండగే` టీజర్ ని డిసెంబర్ 4 లేదా 5 తేదీల్లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే పోస్టర్లు.. సాంగ్ టీజర్లతో ఆకట్టుకున్న ఈ టీమ్ ఈసారి సరికొత్త టీజర్ తో అభిమానులకు ట్రీటివ్వనుంది. ఆ తరువాత కూడా ట్రీట్ అన్ లిమిటెడ్ గానే ఉండనుంది. సాయి తేజ్ ని అనుసరిస్తూ.. మాస్ మహారాజా రవితేజ కూడా తొలి వారంలోనే బరిలో దిగుతున్నాడట. డిస్కో రాజా టీజర్ ట్రీట్ ఆ వారంలోనే ఉంటుందని తెలుస్తోంది. డిసెంబర్ 5 లేదా 6 తేదీల్ని డిస్కో రాజా టీమ్ పరిశీలిస్తోందని తెలిసింది. మొత్తానికి వరుస టీజర్లతో దుమారం రేగనుంది. ఈ నాలుగింటితో పాటు ఇంకా పలు చిత్రాల టీజర్లు ఈ తొలి వారంలో రిలీజ్ కి రెడీ అవుతున్నాయని తెలుస్తోంది. ఫ్యాన్స్ కి విజువల్ ఫెస్ట్ అన్ లిమిటెడ్ అని తాజా సీన్ చెబుతోంది.
Please Read Disclaimer