వీడియో: నువ్వే శ్వాస అంటున్న వర్మ

0

రెండు భాషల్లో ఒక దాన్ని మించి మరొకటి సంచలన విజయం నమోదు చేసిన అర్జున్ రెడ్డి ఇప్పుడు తమిళ రీమేక్ ఆదిత్య వర్మగా విడుదలకు రెడీ అవుతోంది. కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయ్యాక ఇది కూడా అదే స్థాయిలో అంతకు మించి రెస్పాన్స్ దక్కించుకుంటుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. ప్రమోషన్ కూడా మొదలుపెట్టేశారు. అందులో భాగంగా త్వరలో విడుదల కాబోయే మొదటి ఆడియో సింగల్ ఎన్ శ్వాస నీయే పాట తాలూకు ప్రోమోని వీడియో రూపంలో రిలీజ్ చేశారు.

దీన్ని హీరో ధృవ్ విక్రమ్ స్వయంగా పాడటం విశేషం. చాలా హై పిచ్ లో నా శ్వాస నువ్వే నా నెత్తురు నువ్వే అని అర్థం వచ్చేలా వివేక్ రాసిన లిరిక్స్ కు రధాన్ కంపోజ్ చేసిన ట్యూన్ చాలా ఇంటెన్సిటీతో ఉంది. ధృవ్ సైతం ఏదో అనుభవం ఉన్న గాయకుడిలా ఈజ్ తో పాడటం విశేషం. సందీప్ వంగా శిష్యుడు గిరిసాయ దర్శకత్వం వహించిన ఆదిత్య వర్మ మీద కోలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. విక్రమ్ వారసుడి మొదటి సినిమా కాబట్టి అభిమానులు కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నారు.

ధృవ్ కూడా పబ్లిసిటీలో భాగంగా జనంలోకి వెళ్తూ కాలేజీలు తిరుగుతూ తనను తాను పరిచయం చేసుకునే పనిలో పడ్డాడు. అర్జున్ రెడ్డి – కబీర్ సింగ్ లకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఈ ఆదిత్య వర్మ రూపొందిందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే విడుదల కానున్న ఆదిత్య వర్మకు బిజినెస్ డీల్స్ కూడా బాగానే వస్తున్నాయట. బాలాతో తీసిన మొదటి వెర్షన్ ని క్యాన్సిల్ చేసి సంచలనం రేపిన నిర్మాతలు ఫైనల్ గా కోరుకున్న అవుట్ ఫుట్ సాధించారో లేదో ఇంకొద్ది రోజుల్లో తేలిపోతుంది
Please Read Disclaimer