రీమిక్సులా తురుములే భయపడుతుంటే!

0

క్లాసిక్ సాంగ్స్ కి ఫ్యాన్సుంటారు. చార్ట్ బస్టర్ గీతాల్ని రీమిక్స్ చేయాలంటే అందుకే మన దర్శకనిర్మాతలు భయపడుతుంటారు. ఎక్కడ ఏ తేడా వచ్చినా ఫ్యాన్స్ ఆడేసుకుంటారు. సోషల్ మీడియా యుగంలో ట్రోల్స్ తో తాట తీస్తున్నారు. బాగా తీసినా ఏవో వంకలు పెట్టే పరిస్థితి ఉంది. అందుకే ఇది కత్తి మీద సవాల్ లాంటిది.

అయినా మన దర్శకులు రీమిక్స్ పాటలపై మోజు పడుతూ ఎప్పటికప్పుడు క్లాసిక్ బ్లాక్ బస్టర్ గీతాల్ని రీమిక్స్ చేస్తూనే ఉన్నారు. విమర్శలు ఎదురైనా ఈ పంథాని విడిచిపెట్టడం లేదు. ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్ .. వాల్మీకి (గద్దల కొండ గణేష్) చిత్రాల్లో రీమిక్స్ పాటలు వచ్చాయి. వాటిపైనా విమర్శలు తప్పలేదు.

తాజాగా పవన్ కల్యాణ్- కీర్తి రెడ్డి జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ తొలి ప్రేమ నుంచి అదిరిపోయే క్లాసిక్ ని తీసుకుని రీమిక్స్ చేశారు. `ఈ మనసే.. ` అంటూ సాగే ఫీల్ గుడ్ సాంగ్ ని రీమిక్స్ చేసే ప్రయత్నం చేశారు. ఉదయ్ శంకర్ – ఐశ్వర్యా రాజేష్ జంటగా నటించిన మిస్ మ్యాచ్ చిత్రంలో ఈ రీమిక్స్ ని తెలుగు ఆడియెన్ చూడబోతున్నారు. ఇక గానగంధర్వుడు ఎస్పీబీ ఆలపించిన ఆ క్లాసిక్ గీతాన్ని ఇప్పుడు నవతరం గాయకుడు రేవంత్ ఆలపించగా .. గిఫ్టాన్ ఇలియాస్ సంగీతం అందించారు. ఇక ఈ పాటలో ఫ్లేవర్ పూర్తిగా మారిపోవడంతో పవన్ ఫ్యాన్స్ నుంచి ఎలాంటి విమర్శల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందో చూడాలి. ఈ ప్రయత్నం కేవలం పవన్ ఫ్యాన్స్ ని మెప్పించాలనే ఆలోచనతో చేసినా అది మిస్ మ్యాచ్ అవ్వడంపై విమర్శలొస్తున్నాయి.
Please Read Disclaimer