ఈషా రెబ్బా సినిమా అలా జరుగుతోంది!

0

వరంగల్ భామ ఈషా రెబ్బా ప్రస్తుతం ‘రాగల 24 గంటల్లో’ అనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈషా తన కెరీర్ లో మొదటిసారిగా ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. తాజా అప్ డేట్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందట. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆల్రెడీ మొదలయ్యాయని సమాచారం.

ఈ సినిమాకు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో ‘అదిరిందయ్యా చంద్రం’.. ‘టాటా బిర్లా మధ్యలో లైలా’.. ‘యమగోల మళ్ళీ మొదలైంది’.. ‘బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్’.. ‘ఢమరుకం’ లాంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను శ్రీ నిహాస్ క్రియేషన్స్ బ్యానర్ పై కానూరి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సత్యదేవ్.. గణేష్ వెంకటరామన్.. కృష్ణ భగవాన్ ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 5 న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారట.

ఈ సినిమా కథలో ఒక సోషల్ కాజ్ ఉంటుందని.. ఆడియన్స్ కు తప్పకుండా నచ్చుతుందని నిర్మాత కానూరి శ్రీనివాస్ అంటున్నారు. ఇప్పటివరకూ ఈషాకు ఒకటి అరా హిట్స్ తగిలాయి కానీ బ్రేక్ అయితే రాలేదు. మరి ఈ సినిమాతో ఈషా రెబ్బాకు టాలీవుడ్ లో పెద్ద బ్రేక్ లభిస్తుందేమో వేచి చూడాలి.
Please Read Disclaimer