తెలుగమ్మాయికి బాలీవుడ్ ఆఫర్

0

తెలుగమ్మాయి ఇషా రెబ్బా గట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందానికి అందం .. అభినయం ఉన్న నాయికగా ఇషా గుర్తింపును తెచ్చుకుంది. మోడ్రన్ ట్రెండ్స్ ని అనుసరించడంలో .. గ్లామర్ ఎలివేషన్ కి అడ్డు చెప్పని నాయికగాను పాపులరవుతోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఇషా రెబ్బా స్పీడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇటీవల రెగ్యులర్ ఫోటోషూట్లతో అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది.

పరిశ్రమలో మీటూ వ్యవహారాలపై సూటిగా మాట్లాడే తెగువ ఇషా రెబ్బాకు ఉందని ఇంతకుముందు తన కామెంట్లు క్లియర్ కట్ గా చెప్పాయి. సూటిగా ఏదైనా మాట్లాడేస్తే.. ముఖం చాటేసే పరిశ్రమలో ఇషా డేర్ కి ప్రశంసలు దక్కాయి. అయితే ఇలాంటి డేర్ చూపిస్తే తనకు మరో అవకాశం వస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే అన్ని సందేహాలకు చెక్ పెట్టేస్తూ ఇషా ను వెతుక్కుంటూ వస్తున్న దర్శకనిర్మాతల సంఖ్యా పెరుగుతోంది.

ఇకపై ఇషా రెబ్బా కేవలం తెలుగులోనే కాదు ఇరుగు పొరుగు పరిశ్రమల్లోనూ లక్ చెక్ చేసుకోనుంది. తొలిగా బాలీవుడ్ లో అడుగు పెట్టేందుకు సన్నాహకాల్లో ఉంది. ముంబై పరిశ్రమ నుంచి ఇషాకు అదిరిపోయే ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. అనీల్ కపూర్ వారసుడు హర్షవర్ధన్ కపూర్ సరసన సోషల్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలో ఆఫర్ అందుకుంది. బాలీవుడ్ ఫిలింమేకర్ రాజ్ సింగ్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇషా ఈ చిత్రంలో రాజస్థానీ అమ్మాయిగా కనిపించనుంది. మహిళా సాధికారతను.. స్త్రీ శక్తిని ఎలివేట్ చేసే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో నావెల్టీ ఉన్న పాత్రలో ఇషాకు నటించేందుకు ఆస్కారం ఉందని తెలుస్తోంది. ఎస్.ఆర్.కే అనే సినిమాతో ఇషా కన్నడ రంగంలోనూ అడుగుపెడుతోంది. అలాగే తమిళంలోనూ ఓ చిత్రంలో నటిస్తోంది.
Please Read Disclaimer