లాభం లేదు.. ఇక లస్ట్ స్టోరీసే దిక్కు!

0

తెలుగు సినిమాల్లో అచ్చ తెలుగు హీరోయిన్లు ఉండరనేది హైదరాబాద్ లో బీచ్ ఉండదు అన్నంత వాస్తవంగా మారింది. అయితే ఇలాంటి చోట కూడా ఈషా రెబ్బా లాంటి కొందరు తెలుగు భామలు హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పటికి కొన్ని హిట్ సినిమాల్లో నటించినా ఎందుకో ఈషా కెరీర్ పెద్దగా ముందుకు సాగలేదు. మొన్న శుక్రవారం విడుదలైన ‘రాగల 24 గంటల్లో’ సినిమాలో ఈషా ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా హిట్ అయితే ఈషా కెరీర్ లో ఓ మెట్టు పైకి ఎక్కుతుందని అనుకున్నారు కానీ అలా ఏమీ జరగలేదు.

‘రాగల 24 గంటల్లో’ సినిమాకు అటు రివ్యూలు ఇటు మౌత్ టాక్ రెండూ నిరాశపరిచాయి. చిన్న సినిమాలకు హిట్ టాక్ వస్తేనే థియేటర్లలో నిలబడడం లేదు.. ఇక మిక్స్డ్ టాక్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. జయాపజయాల సంగతి పక్కనబెట్టి ఈషాకు తన పాత్ర విషయంలో ఏమైనా మంచి మార్కులు వస్తాయా అంటే అదీ లేదు. అంతంత మాత్రంగా డిజైన్ చేసిన క్యారెక్టర్ లో ఈషాకు చేయడానికి ఏమీ మిగలలేదు.

ఒక తెలుగు అమ్మాయి ఈమధ్యకాలంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడం గొప్ప విషయమే.. కానీ సినిమాలో సత్తా లేని కారణంగా ఈషాకు నిరాశ తప్పేలా లేదు. కెరీర్లో మంచి బ్రేక్ కోసం ఈషా తెలుగు ‘లస్ట్ స్టోరీస్’ పైనే నమ్మకం పెట్టుకోవాలేమో.
Please Read Disclaimer