తెలుగు ‘లస్ట్ స్టోరీస్’ కథలు మారిపోయాయ్!

0

హిందీలో తెరకెక్కిన లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. ఇప్పుడా సిరీస్ ను తెలుగులో తీస్తున్నారు. ఇప్పటికే సంకల్ప్ రెడ్డి రెండు ఎపిసోడ్స్ షూట్ చేసి ఇచ్చాడట.

ఈ ఎపిసోడ్స్ లో ఈషా రెబ్బా – సత్య దేవ్ – అవసరాల శ్రీనివాస్ నటించారట. అయితే ఈ సిరీస్ లో కీయరా రోల్ లోనే కనిపిస్తారా అనే ప్రశ్నకి ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చింది ఈషా. అయితే ఆ కథలు వేరని – తెలుగులో కథలు మార్చారని వాటినే మళ్లీ ఎలా తీస్తారని ప్రశ్నించింది. ఇక కీయరా రోల్ నేను చేస్తున్నట్లు అందరూ అడిగారు కానీ అదేం లేదని నా క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుందని ఇటీవలే రెండు ఎపిసోడ్స్ కూడా పూర్తయ్యాయని – మార్చ్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారని తెలిపింది. ఇక మిగతా ఎపిసోడ్స్ ఎవరు డైరెక్ట్ చేస్తారో తనకి తెలియదని తాను కూడా ఆ విషయంలో ఎగ్జైటింగ్ గానే ఉన్నానని అంటోంది.

ఇక ‘రాగల 24 గంటల్లో’ సినిమాతో మరో మూడు రోజుల్లో థియేటర్స్ లోకి రానున్న ఈషా రెబ్బా తమిళ్ లో జీవీ ప్రకాష్ తో ఓ సినిమా చేశానని అలాగే కన్నడలో శివ రాజ్ కుమార్ సినిమా కూడా చేయబోతున్నానని తెలిపింది.
Please Read Disclaimer