తాడో పేడో తేల్చుకోవడానికే!

0

తెలుగమ్మాయి ఇషారెబ్బా కెరీర్ జర్నీ గురించి తెలిసిందే. ఒక అడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి పడుతున్నాయ్. కెరీర్ పరంగా తాను ఆశించినది ఒకటి అయితే .. దక్కుతున్నది ఇంకొకటి. సోలో నాయికగా అంతకుముందు ఆ తరువాత చిత్రంతో విజయం అందుకున్న తర్వాత వరుసగా అవకాశాలొచ్చినా ఆశించిన విజయాలు దక్కలేదు. అ! లాంటి ప్రయోగాత్మక చిత్రంలో బోల్డ్ యాటిట్యూడ్ ఉన్న పాత్రలో నటించి మైమరిపించింది. అరవింద సమేత లాంటి పెద్ద సినిమాలో నటించినా అదీ ఏమంత కలిసి రాలేదు.

అయితే ఈ జర్నీలో లోపం ఏమిటి? అన్నది విశ్లేషించుకున్నట్టే కనిపిస్తోంది. అందుకే ఇకపై బోల్డ్ లుక్ లో కనిపించేందుకు ఏమాత్రం అభ్యంతరం లేదని ఇటీవల ఓ మెట్టు దిగినట్టే మాట్లాడుతోంది. ఇక ఇషా రెగ్యులర్ గా బోల్డ్ ఫోటోషూట్లతోనూ విరుచుకుపడుతుంటే వాటికి అభిమానుల నుంచి ట్రోల్స్ తప్పడం లేదు. ఇలాంటి వేవీ పట్టించుకునే పరిస్థితిలో ఈ అమ్మడు లేదట. అంతేకాదు.. ప్రస్తుతం తాను నటిస్తున్న బోల్డ్ అండ్ లస్ట్ వెబ్ సిరీస్ లో తన పాత్ర.. గెటప్ ఆడియెన్ ని షాక్ కి గురి చేస్తాయట. మునుపటితో పోలిస్తే బోల్డ్ గా హాట్ గా కనిపిస్తానని తనే స్వయంగా వెల్లడించింది. ముంబై గాళ్స్ తో పోల్చి చూస్తున్నప్పుడు ఆమాత్రం చూపిస్తే తప్పేమీ కాదని అంటోంది.

అందం ఉన్నది చూపించేందుకే.. దాచుకునేందుకు కాదు! అంటూ సూత్రీకరించిన దిశా పటానీ- నభా నటేష్- నిధి అగర్వాల్ బాటలోనే కాస్త అడ్వాన్స్ డ్ డెసిషన్ తోనే దూసుకెళుతోంది ఈ తెలుగమ్మాయి. అయినా ఇంత కాంపిటీషన్ లో తాడో పేడో తేల్చుకోవాలంటే అన్ని విధాలా పట్టు విడుపు తప్పదు. అందాన్ని దాచేస్తే ఒదిగేదేం లేదు.. అవసరం మేర ఓపెన్ అవ్వాల్సిందే ఎవరైనా ఈ మాయా ప్రపంచంలో.
Please Read Disclaimer