తెలుగమ్మాయ్ దెబ్బకు ఒపీనియన్ ఛేంజ్

0

తెలుగందం ఈషా రెబ్బా తీరు మారిందా? ఒపీనియన్ ఛేంజ్ చేసుకోవాల్సిన టైమ్ వచ్చేసినట్టేనా? అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. ఇషా బయటికి వస్తే చాలు సెగలు రేపుతోంది. అంతా కరోనా వల్ల ఇంట్లో ఉండి తమకు నచ్చిన పనులు చేసుకుంటూ బిజీగా గడుపుతుంటే.. ఇషా మాత్రం ఫోటో షూట్ లతో కుర్రాళ్ళలో హీట్ పెంచే ప్రోగ్రామ్ పెట్టుకుంది. తాజాగా ఈ సెక్సీ భామ ఓ వీడియో షూట్ కి పోజులిచ్చింది. బ్లాక్ టీషర్ట్ తో పాటు మరీ చిన్నగా ఉన్నజీన్స్ షార్ట్ ధరించి రెచ్చిపోతోంది. ఫోటోలకు ఆమె ఇచ్చే పోజులు చూస్తుంటే నెటిజనులకు మతి పోతుందంటే అతిశయోక్తి కాదు. తెలుగమ్మాయి కదా కాస్త హద్దులతో ఉంటుందనుకునే వారి అభిప్రాయాలను తాజా ఫోటో షూట్ తో పూర్తిగా మార్చేసింది ఈషా.

తాజాగా ఈ వీడియోని ఈ బొమ్మ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియోని తిలకించేందుకు ఆమె అభిమానులు క్యూ కడుతున్నారు. ఇషా హాట్ హాట్ ఎక్స్ పోజింగ్ షూట్ ని తథేకంగా వీక్షిస్తూ ఖుషీ అవుతున్నారు. `లవ్యూ ఈషా`.. `అల్టీమేట్`.. `చంపేశారు మేడమ్` అంటూ ఆమె ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఆమెని మళ్ళీ మళ్ళీ చూస్తూ లైక్ ల మీద లైక్ లు కొడుతున్నారు. వ్యూస్ ని మిలియన్లని దాటించే పనిలో బిజీగా ఉన్నారు.

ఇక గతేడాది హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ `రాగల 24 గంటల్లో` చిత్రంలో విద్యాగా మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీకి ఇప్పుడు తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు. మరి ఈ ఫోటో షూట్ చూసైనా ఛాన్స్ లు ఆఫర్ చేస్తారేమో చూడాలి. ఇక విశేషమేంటంటే ఈ అమ్మడు తమిళంలో ఓ సినిమా… కన్నడలో మరో సినిమా చేస్తుంది. తమిళంలో జి.వి.ప్రకాష్ సరసన హర్రర్ కామెడీ `ఆయిరమ్ జెన్మంగల్`లో… కన్నడలో శివరాజ్ కుమార్ చిత్రంలో నటిస్తుండటం విశేషం.

 

View this post on Instagram

 

. 🖤 🕳 . #throwback #eesharebba

A post shared by Eesha Rebba (@yourseesha) on
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-