ఈషా రెబ్బా.. యమా స్టైలిష్ అబ్బా!

0

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో తెలుగు అమ్మాయి హీరోయిన్ గా ఉండడం అంటే అదెంత కష్టమో అందరికీ తెలిసిందే. అలాంటి కష్టమైన పని చేస్తూ తనను తాను ప్రూవ్ చేసుకున్న హీరోయిన్ ఈషా రెబ్బా. మొదట్లో మంచి అవకాశాలే వచ్చాయి కానీ ఈమధ్య మాత్రం టాలీవుడ్ లో ఈషాకు అవకాశాలు తగ్గి పోయాయి. కానీ ఈ గోలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాను ఆడుకోవడంలో బిజీగా ఉంది ఈష.

ఈమధ్య ఈష ఒక గ్లామరస్ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలకు “ఎ గోల్డెన్ స్టేట్ అఫ్ మైండ్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. బంగారమంటి మనస్థితి అని మనం అనువాదం చేసుకోవాలేమో. ఇక ఫోటోల విషయానికి వస్తే మోడరన్ డ్రెస్ లో కనిపించింది. చాలా పొట్టిగా ఉన్న జీన్స్ నిక్కరు.. పైనేమో టీషర్ట్.. బ్లేజర్ ధరించి కత్తిలాంటి పోజులిచ్చింది. అభరణాలు అసలేవీ పెట్టుకోకుండా సింపుల్ గా మోడరన్ లుక్ లో ఉంది. ముంబై భామలకు తెలుగు భామలు అసలేమీ తీసి పోరని ఇలాంటి ఫోటోల ద్వారా టాలీవుడ్ సభ్యసమాజానికి గ్లామర్ సందేశం ఇస్తున్నట్టుగా ఉంది.

ఈ ఫోటోలకు నెటిజన్ల నుండి మంచి స్పందన దక్కింది. “స్టన్నింగ్ బ్యూటీ”.. “తెలుగు పాప..మైండు బ్లాకు”.. “ఈషా రెబ్బా అబ్బబ్బబ్బా”..”కిరాక్ పోరి” అంటూ రెచ్చిపోయారు. ఇక ఈషా ఫ్యూచర్ ప్రాజెక్టుల సంగతి మాట్లాడుకుంటే ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు వెర్షన్ లో నటిస్తోంది.
Please Read Disclaimer