ఈషా పాప స్టైల్ సూపర్

0

మన టాలీవుడ్ లో ఉండే అతి తక్కువ మంది తెలుగు హీరోయిన్లలో ఈషా రెబ్బా ఒకరు. తెలుగు హీరోయిన్ల కు టాలీవుడ్ లో ప్రాధాన్యత ఉండదు అనేది అరిగిపోయిన క్యాసెట్ లాంటి స్టేట్మెంట్. దాన్ని ఇంకో కోణం లో చెప్పుకుంటే.. ఈషాకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోయర్లు 1.3 మిలియన్ మాత్రమే. ఒక ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ కు ఈ నంబర్ నిజంగా చాలా తక్కువ. ఎప్పుడూ ఫిలిం మేకర్లు మన తెలుగు అమ్మాయిల కు అవకాశాలు ఇవ్వడం లేదని ఆడి పోసుకుంటామే కానీ ఎంతమంది తెలుగు నెటిజన్లు ఈషాను సోషల్ మీడియా లో.. ఇన్స్టా లో ఫాలో అవుతున్నారు?

అంటే మన హీరోయిన్ల ను మనమే ఆదరించం అనేది సుస్పష్టం. అయితే ఇవేవీ పట్టించుకో కుండా ఈషా మాత్రం నార్త్ భామల కు ఏమాత్రం తగ్గకుండా పోటీలో దూసుకు పోతోంది. ముఖ్యం గా స్పెషల్ ఫోటో షూట్లు చేస్తూ ఆ ఫోటోల ను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ నెటిజన్ల ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గా అలానే ఒక ఫోటో షూట్ చేసింది. బ్లాక్ & వైట్ థీమ్ లో ఉన్న ఫోటోల ను పోస్ట్ చేసి “చూసేకంటే ముందు కన్ను వినడం నేర్చుకోవాలి” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మరి ఈ వరంగల్ భామ డీప్ ఫిలాసఫీ మీకు అర్థం అయితే సరే.. అర్థం కాకపోతే మన తెలుగు అమ్మాయే కదా అని సరిపెట్టుకోండి.

ఫోటోల లో షార్ట్ గౌన్.. లెదర్ జాకెట్.. పొడవాటి షూ ధరించి సూపర్ పోజులు ఇచ్చింది. ఎక్స్ ప్రెషన్స్ కూడా అదిరిపోయాయి. హెయిర్ స్టైల్.. మేకప్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది. ఈ ఫోటోల కు నెటిజన్ల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. “నీ కళ్ళతో ప్రేమ లో పడిపోయా”.. “స్టన్నింగ్.. షైనింగ్ ఈషా”.. “బ్లాక్ ఫిల్టర్ లో కూడా మూన్ లైట్ లా బ్రైట్ గా ఉన్నావు” అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెట్టారు. ఈషా ప్రస్తుతం నటించే సినిమాల విషయాని కి వస్తే ‘రాగల 24 గంటల్లో’ అనే థ్రిల్లర్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు శ్రీనివాస రెడ్డి దర్శకుడు.
Please Read Disclaimer