తెలుగు హీరోయిన్స్ గ్యాంగ్

0

ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు అంతా తెలుగు హీరోయిన్స్ ఉండే వారు. కాలక్రమేనా తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ సంఖ్య తగ్గుతూ ఒకానొక సమయంలో జీరో అయ్యింది. తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా ప్రయత్నించినా కూడా మేకర్స్ వారిని పెద్దగా పట్టించుకునే వారు కాదు. కాని మళ్లీ పరిస్థితి మారుతుంది. ఉత్తరాది ముద్దుగుమ్మలకు ఏమాత్రం తక్కువ కాదంటూ తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే తెలుగమ్మాయి ఇషా రెబ్బా హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుని.. స్టార్ హీరోలకు జోడీగా నటించేందుకు ఎదురు చూస్తోంది. ఇక జీవిత రాజశేఖర్ ఇద్దరు కూతుర్లు కూడా హీరోయిన్స్ గా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్నమ్మాయి శివాత్మిక ఇప్పటికే ‘దొరసాని’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది. పెద్దమ్మాయి శివానీ ఇప్పటికే సినిమాతో రావాల్సి ఉన్నా కూడా ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.

త్వరలోనే శివాని కూడా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ ముగ్గురు తెలుగు అమ్మాయిలకు హీరోయిన్స్ గా మంచి భవిష్యత్తు ఉందనిపిస్తుంది. ఇటీవల ఈ ముగ్గురు ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా ఇలా ఫొటోకు ఫోజ్ ఇచ్చారు. లేడీ హీరోయిన్స్ గ్యాంగ్ అంటూ ఈ ఫొటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు తెలుగు హీరోయిన్స్ ను చూడటం కన్నుల పండుగగా అనిపిస్తుంది. ఈ ముగ్గురు హీరోయిన్స్ కు మరింత మంది తెలుగు హీరోయిన్స్ జత అవ్వాలని కోరుకుందాం.
Please Read Disclaimer