గుడ్డు గేమ్: కుమ్ముకున్న కంటెస్టంట్స్..

0

సోమవారం ఈద్ వేడుకల్లో ఎంజాయ్ చేసిన హౌస్ మేట్స్ కి బిగ్ బాస్ మంగళవారం అదిరిపోయే టాస్క్ ఇచ్చారు. హౌస్ మేట్స్ ని విక్రమపురి – సింహపురి రెండు రాజ్యాలుగా విడగొట్టి ఓ గేమ్ ఇచ్చారు. అందులో బ్లూ టీంకి హిమజని – రెడ్ టీంకి శ్రీముఖిని కెప్టెన్లుగా నియమించి మిగతా సభ్యులని కోరుకోవాలని చెప్పారు. దీంతో హిమజ…వరుణ్ – బాబా భాస్కర్ – రవి – పునర్నవి లని తన జట్టులోకి తీసుకోగా – శ్రీముఖి… అలీ – ఆషూ – మహేశ్ – రాహుల్ లని తీసుకుంది.

ఈ రెండు జట్లు వేరే వాళ్ల రాజ్యంలో తమ రాజ్యం జెండాలు ఎన్ని ఎక్కువ పెడితే వారు గెలిచినట్లు. అయితే తమ రాజ్యంలో జెండాలు పెడితే పీకిపారేయొచ్చు. ఇక అంతకముందు మిగిలిన జ్యోతి – రోహిణి – వితికలకి డ్రాగన్ గుడ్లు దొరకడంతో వాటిని కాపాడుకోవాలని సూచించారు. గేమ్ మొదలు కావడంతో ఒక రాజ్యం సభ్యులు…మరో రాజ్యంలో జెండాలు పెట్టడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో హౌస్ మేట్స్ మధ్య కుమ్ములాట జరిగింది. ఒకరిపై ఒకరు పై చేయి సాధించే క్రమంలో తోపులాట జరిగింది.

అయితే వీరు ఒక స్టేజ్ లో అలిసిపోయి – లాభం లేదు అనుకుని చివరికి రోహిణి – వితిక – జ్యోతి దగ్గర ఉన్న గుడ్లని ముగ్గురు సభ్యులు సొంతం చేసుకున్నారు. ఔట్ అయిన వాళ్ళు సైలెంట్ గా కూర్చోవాలి. అలాగే గుడ్లు సొంతం చేసుకున్న వాళ్ల రాజ్యంలో సైనికులు కూడా ఉండరు. ఇలా చివరికి వచ్చేసరికి రాజ్యంలో సైనికులు కాస్తా గుడ్లు సొంతం చేసుకుని డ్రాగన్లుగా మారారు. దీంతో రాజ్యాల్లో ఎవరు మిగల్లేదు.

అయితే శ్రీముఖి టీంలో సున్నా సభ్యులు మిగిలి… అవతలి రాజ్యంలో 20 జెండాలు పెట్టగా – హిమజ టీం అన్నింటిలోనూ విఫలమైంది. ఇక ఎవరి జట్టులో సభ్యులు మిగలకపోవడంతో వీరు కెప్టెన్ టాస్క్ లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లరని బిగ్ బాస్ చెప్పారు. చివరికి గుడ్లు దక్కించుకున్న అలీ – రవి – రాహుల్ లు రెండో లెవెల్ కి వెళ్లతారని పేర్కొన్నారు.
Please Read Disclaimer