ఏక్ చుమ్మా: ఇది మహా హంగామా

0

బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీ అయిన ‘హౌస్ ఫుల్’ సీరీస్ లో నాలుగవ సినిమాగా వస్తోంది ‘హౌస్ ఫుల్ 4’. ఈ సినిమా ఒక గరం మసాలా ఘాటు బిర్యాని ఎంటర్టెయినర్. అంటే విమర్శకులు.. క్రిటిక్స్ అందరూ సినిమాను చెత్త అని విమర్శిస్తూ ఉంటారు.. కానీ ప్రేక్షకులు మాత్రం ఆ సినిమాలను చూసి హిట్ చేస్తూ ఉంటారు. అందుకే నిర్మాతలు కూడా కరెక్ట్ గా విమర్శకులకు ఏవి నచ్చవో.. ఆ పాయింట్స్ అన్ని మిక్సీలో వేసి మరీ సినిమా తీస్తారు!! ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈమధ్యే ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. తాజాగా ఈ సినిమా నుండి ఏక్ చుమ్మా అంటూ సాగే ఒక వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఇది ‘హౌస్ ఫుల్ 4’ ఆల్బమ్ లో ఫస్ట్ సాంగ్.

ఈ పాట ప్రధాన తారాగణం అయిన అక్షయ్ కుమార్.. బాబీ డియోల్.. రితేష్ దేశ్ ముఖ్.. పూజా హెగ్డే.. కృతి సనన్.. కృతి కర్బందాల మీద సాగుతుంది. ఇక ఈ పాటలో డ్యాన్సర్లు లెక్కపెట్టలేనంత మంది ఉన్నారు. ఈ పాటకు సంగీతం అందించిన వారు సోహైల్ సేన్. సాహిత్యం అందించిన వారు సమీర్ అంజాన్. పాటను పాడిన వారు సోహైల్ సేన్.. అల్తమాష్ ఫరీది..జ్యోతిక టాంగ్రి. పాట పూర్తిగా అరబిక్ స్టైల్ లో ఉంది. లిరిక్స్ కూడా చాలా ఫన్నీగా ఉన్నాయి.. “ఓ మేడమ్ గూగుల్ వాలి.. డోంట్ గో యూ దేకే గాలి ఉమ్మ.. హా గుండోం సే చుడాయా హై.. మైనే తుఝె బచాయా హై.. హా పూచ్ లే సామనే జనతా సే.. ఏక్ చుమ్మా ఏక్ చుమ్మా. ఇక్ చుమ్మాతో బన్తా హై” అంటూ సాగింది. “నేను నీను నిన్ను రౌడీల నుంచి రక్షించాను.. కాపాడాను.. కావాలంటే ఇక్కడున్న ప్రజలను అడుగు.. అర్థం చేసుకొని ఒక్క నాకు ముద్దు ఇవ్వు” అంటూ దీనంగా ఫన్నీగా బతిమాలుకుంటున్నారు!

ఈ పాటను ఆస్కార్ అవార్డుల జ్యూరీ మెంబర్ల లాగా మరీ చీల్చి చెండాడకుండా జస్ట్ టైం పాస్ కోసం చూసేయండి. కొన్నిటికి లాజిక్కులు ఉండవు.. జస్ట్ చూసి ఎంజాయ్ చేయాలి అంతే… ఇది అలాంటి పాటే.