చారుశీల గులాబి బాలా

0

చారు శీల .. స్వప్న బాలా .. యవ్వనాల ప్రేమ పాఠశాలా.. అంటూ దేవీ ట్యూన్ కి అదిరిపోయే స్టెప్పులు వేసి కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టింది శ్రుతి. సూపర్ స్టార్ మహేష్ తో శ్రుతి ఓ రేంజులో సింక్ అయ్యి డ్యాన్సులు చేసింది. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ తో రేస్ లో మరో స్టెప్ దూసుకెళ్లింది. ఆ తర్వాత శ్రుతి రేంజ్ ఇంకెక్కడికో వెళ్లి పోతుంది అనుకుంటే.. అసలు ట్విస్టు అప్పుడే మొదలైంది. విదేశీయుడైన మైఖేల్ కోర్సలే తో ప్రేమలో పడడం వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యత అంటూ సినిమాల్ని వదిలేయడం ఈ అమ్మడికి పెద్ద మైనస్ అయ్యింది. మరోవైపు పాప్ స్టార్ గా ఎదగాలన్న సైడ్ ట్రాక్ కూడా తనకు ఊహించని విధంగా సెట్ బ్యాక్ అయ్యింది.

ప్రస్తుతం రవితేజ సరసన గోపిచంద్ మలినేని తెరకెక్కించనున్న చిత్రంతో కంబ్యాక్ కోసం ట్రై చేస్తోంది. బలుపు తర్వాత మరోసారి మాస్ రాజా శ్రుతికి లిఫ్ట్ ఇస్తున్నారు. ఇటీవలే ఇలియానాకు అమర్ అక్బర్ ఆంటోని చిత్రం లో నటించేందుకు ఇలియానాకు ఎంతో స్నేహ పూర్వకంగా ఓ ఛాన్సిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శ్రుతిహాసన్ కి మరో ఛాన్స్ దక్కింది.

ఇక అదంతా అటుంచితే.. ఇటీవల సోషల్ మీడియాలో ఇతర నాయికల్లానే శ్రుతి పాకులాట కనిపిస్తోంది. వరుసగా రకరకాల ఫోటోషూట్లను ఈ అమ్మడు షేర్ చేస్తోంది. తాజాగా పింక్ గులాబీని పెదవుల మధ్య బిగించి పూర్తిగా పింక్ ఊల్ షర్ట్ లో సింపుల్ లుక్ తో ఉన్న ఫోటోని అభిమానులకు షేర్ చేసింది. ఈ ఫోటోలో శ్రుతి లోని నేచురల్ బ్యూటీ బయటపడిందని చెప్పొచ్చు. అయితే కోల్పోయిన స్టార్ డమ్ ని తిరిగి రాబట్టాలంటే శ్రుతి ఇంతటితో సరిపెడితే కుదరదు. కాంపిటీషన్ లో అందాల భామలు రకరకాల మాధ్యమాల్లో నిరంతర ఫోటో షూట్ల తో దూసుకొస్తున్నారు. రేసులో దూసుకెళ్లాలంటే ఎలాంటి కొత్త ఎత్తుగడలు వేస్తుందో చూడాలి.
Please Read Disclaimer