గ్రీకు దేవతలా ఉందే!

0

హిందీ సినిమాలను ఫాలో అయ్యేవారికి బాలీవుడ్ భామ ఎవెలిన్ శర్మ పేరు తెలిసే ఉంటుంది. బాలీవుడ్ లో ఉన్న విదేశీ భామల్లో ఈ భామ ఒకరు. ఈభామకు ఇండియన్ మూలాలు ఉన్నాయి. ఎవెలిన్ నాన్నగారు ఇండియన్. ‘ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్’.. ‘నౌటంకీ సాలా’.. ‘ఏ జవాని హై దీవాని’.. ‘హిందీ మీడియం’ లాంటి సినిమాల్లో నటించింది. ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. హాటు ఫోటోలతో మంటలు పెట్టడం ఈ భామకున్న నాటీ అలవాటు.

ఆ అలవాటును మర్చిపోకుండా తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో ను పోస్ట్ చేసి “రహస్యం తెలుసుకోవాలని ఉందా? www.EvelynsSecrets.com వెబ్ సైట్ కు ను ఓపెన్ చేసి నా బ్యూటీ సీక్రెట్స్ తెలుసుకోండి. ఇంకా నా గురించి ఏం తెలుసుకోవాలో కామెంట్స్ సెక్షన్ లో నాకు చెప్పండి” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఫోటోలో ఒక బ్యూటిఫుల్ గౌన్ ధరించి ఒక రౌండ్ టేబుల్ ముందు కూర్చుని మేకప్ కిట్ నుండి పెర్ఫ్యూం ను బయటకు తీసి టెస్ట్ చేస్తోంది. ఆ టెస్ట్ పక్కన పెడితే.. అమ్మడి అందాల విందు.. మోములో ఆ చిరునవ్వును చూస్తే హాట్ నెస్ ను క్యూట్ నెస్ ను ఒకేసారి మిస్ చేసి దానికి కాస్త మేకప్ ను కలిపి నెటిజన్లకోసం రంగరించినట్టుగా ఉంది. ఈ భామ జర్మనీ నుంచి ఇండియాకు రాకపోతే కళాపోషకుల లిస్టులో ఒక అప్సరస మిస్సయి ఉండేది.

ఈ ఫోటోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. “నువ్వు బ్యూటిఫుల్ యాక్ట్రెస్ మాత్రమే కాదు.. సూపర్ స్టైలిస్ట్”.. “అంత హాట్ ఎలా?”.. “గ్రీకు దేవతలా ఉన్నావు” అంటూ కామెంట్లు పెట్టారు. కొందరేమో ‘సాహో’ సినిమా నుంచి నీ పోస్టర్ ఎప్పుడు వస్తుంది అని అడిగారు. విషయం తెలుసు కదా… ప్రభాస్ ‘సాహో’ లో ఎవెలిన్ ఒక కీలక పాత్రలో నటిస్తోంది.
Please Read Disclaimer