రాజమౌళికి షాక్ ఇచ్చిన హాలీవుడ్ బ్యూటీ?

0

స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం ‘RRR’ ప్రాజెక్టుపై పని చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్.. ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. క్రేజు.. హైపు ఆకాశాన్ని తాకుతున్నాయి కానీ షూటింగ్ విషయంలో మాత్రం పలు చికాకులు ఎదురవుతున్నాయి.

ఇప్పటికే చరణ్.. ఎన్టీఆర్ కు గాయలయిన కారణంగా కొన్ని రోజులు షూటింగ్ వాయిదా పడింది. ఎన్టీఆర్ కు జోడీగా బ్రిటిష్ నటి డైసీ ఎడ్గార్ జోన్స్ ను ఎంపిక చేసుకుంటే ఆమె చివరి నిముషంలో ఈ సినిమా నుండి తప్పుకుంది. డైసీ స్థానంలో హాలీవుడ్ భామ ఎమ్మా రాబర్ట్స్ ను ఎంచుకున్నారని.. రాజమౌళి ఇప్పటికే ఎమ్మాతో చర్చలు జరిపారని త్వరలో ఆమె ‘RRR’ టీమ్ తో జాయిన్ అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఎమ్మా రాబర్ట్స్ ఈ ‘RRR’ లో నటించేందుకు నిరాకరించిందట. ఈ సినిమాలో నటించడానికి ఆమెకు అభ్యంతరం లేకపోయినా బల్క్ డేట్స్ ఇచ్చేందుకు ఆసక్తి లేని కారణంగా ‘నో’ చెప్పిందని టాక్.

దీంతో రాజమౌళి ఎన్టీఆర్ కు జోడీగా మరో భామ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారని అంటున్నారు. ఒకవేళ ఇది నిజమే అయితే ‘RRR’ షూటింగ్ కు మరో అడ్డంకి అని చెప్పాలి. వరసగా ఈ సినిమాకే ఏదో ఒక ఇబ్బంది ఎందుకు వస్తోందనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఏదేమైనా ఈ సినిమా మాత్రం ముందుగా ప్రకటించిన సమయానికే రిలీజ్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Please Read Disclaimer