జూనియర్ కు జోడి దొరికిందా ?

0

ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ప్రారంభమై అటు ఇటుగా ఆరు నెలలు దాటేసింది. ఎక్కడిదాకా వచ్చిందనే సంగతి రాజమౌళికి తప్ప ఇద్దరు హీరోలకూ తెలియదేమో అన్నంత గుట్టుగా ప్రైవసీ మైంటైన్ చేస్తున్నారు. రెగ్యులర్ గా అయితే సాగడం లేదనే సంగతి పదే పదే చరణ్ ఎన్టీఆర్ లు తీసుకుంటున్న బ్రేకులతో అర్థమైపోతోంది. కారణాలు ఏమైనా అతి త్వరలో నాన్ స్టాప్ మెట్రో ఎక్స్ ప్రెస్ స్పీడ్ తో షూటింగ్ ని కొనసాగించబోతున్నట్టు తెలిసింది.

అయితే ఇప్పటిదాకా జూనియర్ ఎన్టీఆర్ కు జోడీని సెట్ చేయనే లేదు. అనౌన్స్ మెంట్ టైంలో విదేశీ భామ డైసీ ఎడ్గార్ జోన్స్ ని తీసుకున్నారు కానీ తర్వాత ఏవో కారణాలు చెప్పి ఆ అమ్మాయి తప్పుకుంది. ఇక అది మొదలు ఇంకో రీ ప్లేస్ మెంట్ కోసం జక్కన్న చేయని ప్రయత్నం లేదు. కథ ప్రకారం బ్రిటిష్ లుక్స్ ఉన్న హీరోయిన్ కావాలి కాబట్టి అలాంటి ఫీచర్స్ ఉన్న బాలీవుడ్ బ్యూటీస్ ని ట్రై చేశారు కానీ వర్క్ అవుట్ కాలేదనే టాక్ వచ్చింది

తాజా అప్ డేట్ ప్రకారం ఇప్పుడు ఎమ్మా రాబర్ట్స్ పేరు తెరపైకి వచ్చింది. ఈవిడ రెగ్యులర్ గా ఇంగ్లీష్ సినిమాలు చూసేవాళ్లకు పరిచయమే కానీ ప్రపంచమంతా తెలిసినంత పాపులర్ కాదు. వైల్డ్ చైల్డ్-నెర్వ్ లాంటి సినిమాలతో బాగానే పేరు తెచ్చుకుంది. ఓసారి స్క్రీన్ టెస్ట్ చేసి తన అంచనాలకు తగ్గట్టు ఉందంటే ఎమ్మాకే ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉందట.

ఇది అఫీషియల్ గా తెలిసింది కాదు కాబట్టి రాజమౌళి ప్రకటించే దాకా వాస్తవంగా పరిగణించలేం. ఫిక్స్ చేసుకున్న రిలీజ్ డేట్ కు ఏడాది మాత్రమే సమయం ఉండటంతో మూడు వందల కోట్ల బడ్జెట్ తో ముడిపడిన ఈ ప్రాజెక్ట్ రాజమౌళి అంత వేగంగా పూర్తి చేయగలడా అనే చర్చలు ఇండస్ట్రీలో ఉన్నాయి. మరోసారి ప్రెస్ మీట్ పెట్టి వీటి తాలూకు స్పష్టత ఇస్తే బెటర్
Please Read Disclaimer