లేడీ బ్రూస్ లీ.. ఆ లెవల్లోనా ఆర్జీవీ ?

0

మార్షల్ ఆర్ట్స్ పై ఆర్జీవీ పిచ్చి గురించి తెలిసిందే. తన ఫేవరెట్ మార్షల్ స్టార్ బ్రూస్ లీ కథతో సినిమా తీయాలన్న కల నెరవేరకపోయినా.. ఇదిగో ఇలా లేడీ బ్రూస్లీని బరిలో దించాడు. అతడి నుంచి ఏకంగా ఓ ఇంటర్నేషనల్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. `ఎంటర్ ది గర్ల్ డ్రాగన్` అనేది టైటిల్. ఇందులో లేడీ బ్రూస్లీ విన్యాసాల్ని చూపించబోతున్నాడు. ఇంతకుముందు బ్రూస్ లీ జయంతి కానుకగా టీజర్ ని రిలీజ్ చేస్తే అంతర్జాలంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 13న ట్రైలర్ ని బ్రూస్ లీ సొంత నగరం చైనా- ఫోషన్ సిటీ లో రిలీజ్ చేస్తానని ఆర్జీవీ ప్రకటించాడు. ఇండో చైనీస్ కో ప్రొడక్షన్ లో ఈ సినిమాను నిర్మిస్తున్న ఆర్జీవీ చైనాలోనూ భారీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

తాజాగా రిలీజ్ చేసిన లేడీ బ్రూస్లీ పోస్టర్ నెటిజనుల్లో వైరల్ గా మారింది. ఈ పోస్టర్ లో లేడీ బ్రూస్ లీని తనదైన మార్క్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఆర్జీవీ. చీరలో ఉన్నా లేడీ బ్రూస్ లీ అలా గాల్లోకి కాలు లేపి ఎగరేసి తంతున్న ఈ ఫోటో యూత్ లో ప్రస్తుతం హాట్ టాపిక్.

ఆర్జీవీ తెరకెక్కించిన `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే అన్ని వివాదాలు పరిష్కరించుకున్న ఈ చిత్రానికి సెన్సార్ నుంచి క్లియరెన్స్ వచ్చేసింది. తెర నిండుగా కుల రాజకీయాలు.. హత్యా రాజకీయాల్ని ఆర్జీవీ చూపిస్తున్నారన్న ప్రచారం ఉంది. పోస్టర్లు ట్రైలర్ తో ఇప్పటికే జనాల్లోకి దూసుకెళ్లింది ప్రచారం. వెంకీమామ రిలీజ్ కి ఒకరోజు ముందు వస్తున్న ఈ చిత్రం ఏ మేరకు పోటీనివ్వనుంది అన్నది చూడాలి.
Please Read Disclaimer