ఆర్జీవీ మార్షల్ రొమాన్స్

0

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మార్షల్ ఆర్ట్స్ నేపథ్య చిత్రం ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’. ఈ సినిమా ఇండియాలో మొదటి మార్షల్ ఆర్ట్స్ చిత్రమని చెప్తున్నారు. ఈ సినిమా ఇండో-చైనా నిర్మాతల భాగస్వామ్యంలో తెరకెక్కుతున్న జాయింట్ వెంచర్. ఈ సినిమాలో పూజ భలేకర్ ప్రధాన పాత్రలో నటించింది.

‘నిన్ను ఒకే వ్యక్తి ఆపగలడు ఆ వ్యక్తి నువ్వే: బ్రూస్ లీ’ అనే కొటేషన్ తో టీజర్ ప్రారంభం అవుతుంది. నేపథ్యంలో బ్రూస్ లీ రియల్ వాయిస్ వినిపిస్తూ ఉంటే హీరోయిన్ పూజ రెడ్ కలర్ స్పైసీ డ్రెస్ లో రెండు కొండల మధ్య పరిగెడుతూ ఉంటుంది. వెనక ఒక తెల్లటి గుర్రం కూడా ఉంటుంది. ఇక టీజర్ మొత్తం యాక్షన్ సీన్స్ తో నిండిపోయింది. పకపకా నవ్వుతున్న ఒకడిని ప్యాంట్ జిప్పు గురి చూసి మరీ తన్నడాలు.. చేజింగ్ చేస్తూ గాలిలోకి ఎగిరి మరీ రౌడీకి కాలితో ఒక్క పంచ్ ఇవ్వడాలు.. ఇలాంటి సీన్లు అదిరిపోయాయి. ఇక ఈ టీజర్ లో మార్షల్ రొమాన్స్ ఉంది. ఇలాంటి పదం ఎక్కడ వినలేదు అంటారా.. మార్షల్ ఆర్ట్స్ లో ఇలా స్పైసీనెస్ ను మిక్స్ చేస్తే దానికో కొత్త పేరు పెట్టుకోవాలి కదా? అసలు ఆ ఆలోచన ఎలా వచ్చిందో కానీ గురుడికి కొన్ని షాట్లలో ఆ స్టంట్లకు హీరోయిన్ లో ఉండే సెక్సీనెస్ ను మిక్స్ చేసి వర్మ స్టైల్ ‘కళాత్మకత’ను చూపించాడు. ముఖ్యంగా కొన్ని సీన్లు అలాంటివి ప్రస్తావించుకోవాలి. అరడుగు లోతు నీటిలో ఉల్టా పల్టాగా నిలుచుని వానలో ఒక కాలును పైకెత్తుతుంది పూజ. మరో షాట్ లో మైక్రో నిక్కర్ ధరించి గాల్లోకి లేచి కుడికాలుతో ఒకరిని.. వెంటనే ఎడమ కాలితో ఒకరిని తుత్తునియలు చేస్తుంది. ఈ షాట్లో గురుడు పూర్తిగా పూజ తొడలపై దృష్టి సారించి స్లో మోషన్ లో తొడ కండరాల కదలికలను క్షుణ్ణంగా చూపించాడు. ఇలాంటి పని ప్రపంచంలో చేసిన మొట్టమొదటి వ్యక్తి మన వర్మ అని చెప్పుకునేందుకు తెలుగువారిగా ‘గర్వపడక’ తప్పని పరిస్థితి కల్పించాడు!

అన్నీ ఇట్టాంటివేనా ఇంకేం లేదా అని చిరాకు పడకండి. ఉన్నాయి.. మాంచి మూతి ముద్దులకు స్థానం కల్పించి కుర్రకారు ఆదరణ చూరగొనే ప్రయత్నం కూడా చేశాడు ఆర్జీవీ. టీజర్ లో ఇది మార్షల్ రొమాన్సో ఇండో చైనీస్ మసాలా అని అర్థం అవుతుంది. మీకు అర్థం అయినంత అర్థం చేసుకోండి…సినిమా విడుదల కోసం వేచి చూడండి. అంతలోపు టీజర్ పై దృష్టి సారించండి.
Please Read Disclaimer