ఎంత మంచి వాడవురా సెన్సార్ టాక్

0

సంక్రాంతి సినిమాలు ఒక్కొక్కటిగా సెన్సార్ పనులు పూర్తిచేసుకున్నాయి. ముందుగా దర్బార్ సెన్సార్ పూర్తయితే ఆ వెంటనే మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సెన్సార్ జరిగింది. ఇక ఆ మరుసటి రోజే బన్నీ ‘అల వైకుంఠపురములో’ సెన్సార్ ఫార్మాలిటీస్ ఫినిష్ అయ్యాయి. ఇక నిన్న సంక్రాంతి రోజున వస్తున్న కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచి వాడవురా’ సెన్సార్ పూర్తయింది.

సినిమాకు క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ అందించింది సెన్సార్ బోర్డ్. రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల రన్ టైం ఉన్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నటన వెన్నెల కిషోర్ కామెడీ సాంగ్స్ సుహాసిని తనికెళ్ళ భరణి ల ఎమోషనల్ సన్నివేశానల్ సీన్స్ ప్లస్ పాయింట్స్ అని సమాచారం. ఇక సినిమాలో వచ్చే ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ తో పాటు గోదావరి ఫైట్ కూడా మాస్ ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేసేలా ఉంటాయట.

సంక్రాంతి స్పెషల్ గా ‘ దర్బార్ ‘ జనవరి 9 న రిలీజవుతుంటే ‘సరిలేరు నీకెవ్వరు’ జనవరి 11 న థియేటర్స్ లోకి వస్తుంది. ఆ మరుసటి రోజే బన్నీ సినిమా వస్తోంది. ఇక సరిగ్గా సంక్రాంతి రోజు జనవరి 15న ఎంత మంచివాడవురా విడుదలవుతుంది. మరి ఈ సంక్రాంతి పోటీలో మంచోడు ఎంత కలెక్ట్ చేస్తాడో ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో చూడాలి.
Please Read Disclaimer