మా మంచి హీరోయిన్ హనీ!

0

హనీ ఈజ్ ద బెస్ట్ .. హనీ ఈజ్ ద బెస్ట్.. అంతేగా అంతేగా!! 2019 మెహ్రీన్ కి కలిసొచ్చిన సంవత్సరం. ఆరంగేట్రమే సంక్రాంతి బరిలో బంపర్ హిట్ కొట్టింది ఎఫ్ 2 చిత్రంతో. అందులో మెహ్రీన్ కి నటనకు ఆస్కారం ఉన్న పాత్ర లభించింది. హనీ పాత్రలో కుర్రకారు గుండెల్ని చిదిమేసింది.

అందుకే ఇప్పుడు కళ్యాణ్ రామ్ చిత్రం `ఎంత మంచివాడవురా!`లో ఎలాంటి పాత్రలో నటిస్తోంది? అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇంతకీ ఈ చిత్రంలో ఎలాంటి పాత్రలో నటిస్తోందో ప్రత్యేకంగా చెప్పాలా.. బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్ చూస్తేనే తెలిసిపోతోంది. మా మంచి హీరోయిన్ మెహరీన్ కి బర్త్ డే శుభాకాంక్షలు అంటూ టీమ్ విష్ చేసింది.

మెహ్రీన్ ఆల్వేస్ స్మైలీ లవ్ లీ గాళ్ అని ఈ పోస్టర్ చెబుతోంది. తన పాత్రలో ఎన్ని షేడ్స్ ఉన్నా నవ్వు ముఖంతోనే అన్నిటినీ డామినేట్ చేసేస్తోంది. ఎంతమంచివాడవురా టీమ్ నుంచి బర్త్ డే విషెస్ అందుకున్న మెహ్రీన్ అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. తన ఫేస్ బుక్ .. ట్విట్టర్ లో బర్త్ డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు.. వీడియోల్ని షేర్ చేసింది. వీటికి ఫ్యాన్స్ నుంచి అద్భుత స్పందన వస్తోంది. “థాంక్యూ సో మచ్.. అంత ప్రేమగా శుభాకాంక్షలు చెప్పినందుకు నా మంచి మంచి `ఎంతమంచివాడవురా` టీమ్“ అంటూ మెహ్రీన్ కాస్తంత ఎమోషన్ అయ్యింది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home