ఎంత మంచివాడవురా 6 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

0

హిట్ కోసం పరితపిస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా ఎంత మంచివాడవురా సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైన సంగతి తెల్సిందే. అయితే ఈ చిత్రానికి ఆశించినట్లుగా పాజిటివ్ టాక్ రాలేదు. యావరేజ్ టాక్ మాత్రమే వచ్చింది. అందులోనూ పోటీకి రెండు పెద్ద సినిమాలు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో పోటీకి ఉండడంతో ఎంత మంచివాడవురా చిత్రానికి ఆ ఎఫెక్ట్ తగిలింది.

మొదటి రోజు ఈ చిత్రం 4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి పర్వాలేదనిపించింది. అయితే టాక్ అంత ఆశాజనకంగా లేకపోవడంతో ప్రేక్షకులు రెండు భారీ సంక్రాంతి సినిమాల వైపే మొగ్గు చూపారు. అయితే ఆరు రోజులకు గాను ఎంత మంచివాడవురా 6 కోట్ల షేర్ ను వసూలు చేసింది. సెలవులు అయిపోయి వర్కింగ్ డేస్ మొదలవ్వడంతో ఇక ఎంత మంచివాడవురా కలెక్షన్స్ బాగా క్షీణించాయి. మొత్తంగా చూసుకుంటే ఎంత మంచివాడవురా ఫుల్ రన్ లో 7 కోట్ల షేర్ కలెక్ట్ చేసే అవకాశముంది. ఈ చిత్రానికి దాదాపు 10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఈ రకంగా చూసుకుంటే ఎంత మంచివాడవురాను ప్లాప్ కేటగిరీలో వేసేయొచ్చు.

నందమూరి కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో శరత్ బాబు, సుహాసిని, నరేష్, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి వంటి వారు కీలక పాత్రలు పోషించారు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించగా సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఎంత మంచివాడవురా 6 డేస్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్ :
నైజాం : Rs 1.39 Cr
సీడెడ్ : Rs 0.79 Cr
గుంటూరు : Rs 0.65 Cr
వైజాగ్ : Rs 0.78 Cr
ఈస్ట్ గోదావరి : Rs 0.91 Cr
వెస్ట్ గోదావరి : Rs 0.63 Cr
నెల్లూరు : Rs 0.23 Cr
కృష్ణ : Rs 0.67 Cr

ఆంధ్ర + తెలంగాణ : Rs 6.05 Cr షేర్స్




Please Read Disclaimer