‘ఎర్రగడ్డ లవ్ స్టోరీ’: యాక్షన్ కాదు ఓవర్ యాక్షన్..

0

బిగ్ బాస్ బుధవారం ఇంటి సభ్యులులకు ఇచ్చిన ఛలో ఇండియా టాస్క్ గురువారం కూడా కొనసాగింది. ఇంటి సభ్యులు వివిధ పాత్రల్లో నటిస్తూ…బిగ్ బాస్ ఎక్స్ ప్రెస్ లో ఇండియాలోని వివిధ ప్రదేశాలు తిరిగొచ్చేశారు. ఒకవైపు జంటగా నటిస్తున్న పునర్నవి-రవిలు రొమాన్స్ లో ఏ మాత్రం తగ్గకపోగా – శ్రీముఖి అలీకి లైన్ వేస్తూనే ఉంది. మధ్యలో హిమజ-మహేశ్ జంట గొడవలు పడుతూనే ఉన్నారు. అటు వరుణ్-రాహుల్ డ్రైవింగ్ లో బిజీగా ఉండగా – బాబా భాస్కర్ టీ – స్నాక్స్ అమ్మారు. ఇలా ఎవరి పాత్రలో వారు జీవించారు.

ఇక మధ్య మధ్యలో బిగ్ బాస్ ఎక్స్ ప్రెస్ కొన్ని స్టేషన్స్ లో ఆగుతూ ఇంటి సభ్యులకు కొన్ని టాస్క్ లు ఇచ్చారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఐదు నిమిషాల నిడివి గల ఓ స్టోరీని తీయాలని టాస్క్ ఇచ్చారు. దీనికి ఎర్రగడ్డ లవ్ స్టోరీ అని పేరు పెట్టి బాబా భాస్కర్ డైరక్షన్ చేశాడు. కెమెరామెన్ గా వరుణ్ – అసిస్టెంట్ గా రాహుల్.. నటీనటులుగా శ్రీముఖి – హిమజ – రవి – అలీ – మహేష్ – పునర్నవి – వితిక – జ్యోతిలు ఉన్నారు. యాక్షన్ లో దిగిన ఇంటి సభ్యులు ఫుల్ ఓవర్ యాక్షన్ చేశారు. ఎర్రగడ్డ స్టోరీకి తగ్గట్టుగా పిచ్చి పిచ్చిగా చేసేశారు.

దీని తర్వాత ట్రైన్ ఇంకో స్టేషన్ లో ఆగగా – అక్కడ అలీ రాహుల్ మధ్య స్విమ్మింగ్ పూల్ లో చేపలు పట్టే టాస్క్ ఇచ్చారు. ఎవరు ఎక్కువ చేపలు పడితే వారు గెలిచినట్లు దీంతో అలీ-రాహుల్ పోటీపడి మరి చేపలు పట్టారు. చివరికి అలీ ఎక్కువ చేపలు పట్టడంతో విన్నర్ గా నిలిచాడు. మాములుగానే షర్ట్ తీసి రచ్చ చేసే అలీ ఈ టాస్క్ లో కేవలం షార్ట్ వేసుకుని ఎక్స్ పోజ్ చేశాడు. తన సిక్స్ ప్యాక్ చూపిస్తూ స్టెప్పులతో అలరించాడు.
Please Read Disclaimer