ఏంజెలీనా లాగా ఉందే!

0

అదేంటో కానీ హాటు బ్యూటీలకు బాలీవుడ్ ఎప్పుడూ కేరాఫ్ అడ్రెస్ లాగా ఉంటుంది. నిజానికి అక్కడ బ్యూటీల సంఖ్య ఎక్కువై.. వారు టాలీవుడ్ కు కోలీవుడ్ కు దిగుమతి అవుతుంటారు. ఇక ఫ్యాషన్ రంగంలో సత్తా చూపిన మోడల్స్ కు ఫైనల్ డెస్టినేషన్ ఎప్పుడూ బాలీవుడ్డే. 2007 లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటం గెలుచుకున్న ఈషా గుప్తా అదే ట్రెండ్ ఫాలో అయింది. 2012 లో ‘జన్నత్ 2’ సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకూ డజను సినిమాల్లో నటించింది.

ఈ హాటు అందం బాలీవుడ్ కు మాత్రమే పరిమితం అయిందని బాధపడనవసరం లేదు. చరణ్ సినిమా ‘వినయ విధేయ రామ’ లో ‘ఏక్ బార్ ఏక్ బార్’ అనే పాటలో స్టెప్పులు కూడా వేసింది. ఇక సోషల్ మీడియాను తన హాటు ఫోటోలతో ఫ్రై చెయ్యడంలో ఈషా టాలెంట్ అందరికీ తెలిసిందే. తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. మొనోకిని ధరించి వెనకకు తిరిగి నిలుచుంది. సడెన్ గా చూస్తే హాలీవుడ్ హీరోయిన్ ఎంజెలీనా జోలీని తలపిస్తోంది. బ్లాక్ అండ్ వైట్ ఫోటో కావడంతో పికాసో చిత్రంలా ఉంది. అయినా ఈషాకు ఈ హాట్నెస్ ఎలా వచ్చిందో కానీ నెటిజన్లు పిచ్చెక్కిపోయారు.

“ఇంత హాటుగా కనిపించడం అక్రమం”.. “ఏంజెలీనా జోలీ లా కనిపిస్తున్నావు”.. “బెస్ట్ బ్యాక్ ఇన్ ది వరల్డ్” అంటూ పొగడ్తలు కురిపించారు. ఇక ఈషా ఫ్యూచర్ సినిమాల విషయానికి వస్తే ‘దేశి మ్యాజిక్’.. ‘వన్ డే: జస్టిస్ డెలివర్డ్’.. ‘హేరా ఫేరి 3’ సినిమాల్లో నటిస్తోంది.
Please Read Disclaimer