డేంజర్.. 10000 వోల్టుల గ్లామర్

0

పూల చెట్టుకు పూలు.. పండ్ల చెట్టుకు పండ్లు ఉన్నట్టే బాలీవుడ్ లో హాటు బ్యూటీలు ఉంటారు. మరి టాలీవుడ్ లో అలా లేరా అంటే.. ఉంటారు కానీ బాలీవుడ్ రేంజ్ రచ్చభామలు తక్కువే. బాలీవుడ్ లో ఉన్న లెక్కలేనంతమంది హాటు బ్యూటీలలో ఈషా గుప్తా ఒకరు. ఈ భామ ‘జన్నత్ 2’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. చాలా సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా మారక మునుపు సూపర్ హాట్ మోడల్. అందుకే ఫ్యాషన్ విషయంలో పాపకు ఎవరూ సాటిలేరు.

మరి అంత టాలెంట్ ఉంటే సోషల్ మీడియాలో నెటిజన్లను కాల్చుకు తినడం అనే కళ ఆటోమేటిక్ గా ఒంటబడుతుంది కదా. అందుకే తరచుగా చాకు లాంటి ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేస్తుంది. తాజాగా మరోసారి అదే పని చేసింది. ఈ ఫోటోకు “సూర్యకిరణాలు ప్రసరించినప్పుడు” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఫోటోలో ఈషా ఒక స్లీవ్ లెస్ గౌన్ ధరించి గోడకు దగ్గరగా కూర్చుంది. కళ్ళు మూసుకుని ఒక చేతిని కంటి మీద పడిన శిరోజాలను సవరించుకుంటున్నట్టుగా.. ఏదో ఆలోచిస్తున్నట్టుగా పోజిచ్చింది. కాలి అందాలతో పాటుగా డీప్ వీనెక్ అందాలు నెటిజన్ల మతులు పోగొట్టేలా ఉన్నాయి. ఆభరణాలు లేకుండా అతి తక్కువ మేకప్ తో ఈ హాట్ నెస్ తీసుకురావడం ఒక కళ. క్యాప్షన్ లో చెప్పినట్టుగా సూర్యకాంతితో ఈషా అందాలకు కాంతి వచ్చింది.

ఈ దెబ్బతో నెటిజన్లు వెర్రెత్తిపోయి మరీ కామెంట్లు పెట్టారు. “ఉఫ్.. క్యా అదా హై”.. “సండే స్పెషల్ జిలేబి”.. “బేబీ మరీ ఇంత హాట్ అయితే ఎలా?” అంటూ కామెంట్లు పెట్టారు. ఇక ఈషా ఫ్యూచర్ సినిమాల విషయానికి వస్తే ‘దేశి మ్యాజిక్’ అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది.
Please Read Disclaimer