అల షో స్టాపర్.. మ్యాడమ్ పైనే కళ్లన్నీ

0

ఆమె నవ్వు.. ఆమె చూపు.. ఆమె తలపు.. అబ్బబ్బో ఒకటే కవ్వింత… తుళ్లింత!! అందుకే ఆ ఈవెంట్లో షో స్టాపర్ అయ్యారు. చుట్టూ జనం కళ్లు ఎటూ తిప్పుకోకుండా తనపైనే దృష్టి సారించారంటే అర్థం చేసుకోవాలి.. ఆ చిలిపి కళ్లలో రస రమ్యమైన నవ్వులో.. నల్ల రంగు కోక రవికెలో ఏదో గమ్మత్తు దాగి ఉంది. ఆ కాంబినేషన్ తనకు సూటైనట్టుగా ఇంకెవరికీ సూట్ కాదేమో! ఒకే ఒక్క ఈవెంట్ తో సీనియర్ నటి టబు ఇండస్ట్రీ ని తనవైపు లాగేశారంతే.

అంతకుముందు ట్రైలర్ లోనూ అరక్షణం కనిపించినా ఏదో మత్తు చల్లిన వైనాన్ని ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఇంతలోనే అల వైకుంఠపురములో మ్యూజిక్ కాన్సెర్ట్ ధన్యమైంది. అలా చంపేసారు మ్యాడమ్.. అల ఈవెంట్లో అల ఎవరు మీరేనా? అన్నంతగా పరవశించి పోయారు. ఓ వైపు స్టార్ హీరో అల్లు అర్జున్.. మరోవైపు మాయావి త్రివిక్రమ్ ఎంతగా నవ్వులు చిందించినా కిసుక్కుమనే టబు నవ్వు కోసమే జనం ఆత్రంగా చూశారు మరి! ఇటీవలి కాలంలో అంతగా ప్రభావితం చేసిన వేరొక నటి లేనే లేరు.

నదియా- ఇంద్రజ- మధుబాల- రోహిణి- కాజోల్ .. ఎందరో కథా నాయికలు రీఎంట్రీ ఇచ్చినా టబు రేంజులో ఇవ్వలేదు సుమీ! అల వైకుంఠపురములో చిత్రానికి ఆ టీమ్ కి ఎంతో గ్లామర్ తెచ్చేశారు మ్యాడమ్. ఆ నవ్వులో గిలిగింత ఏదో కనిపెట్టేసిన మాయావి తన కోసమే తపించి అవకాశం ఇచ్చారు మరి. అన్నట్టు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తుంటే.. కొంత గ్యాప్ తర్వాత టబు రీఎంట్రీ ఇస్తున్నారు. మరి ఆ ఇద్దరిలో సంక్రాంతి షో గెలిచేది ఎవరో? ఇప్పటికే విజయశాంతి వర్సెస్ టబు అంటూ అభిమానులు సోషల్ మీడియా లో డిబేట్లు పెట్టడం చూస్తున్నదే.
Please Read Disclaimer