ఎవరు తొలిరోజు షేర్ ఎంత?

0

అడివి శేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. రెజీన.. నవీన్ చంద్ర ప్రధాన పాత్రధారులు. వెంకట్ రాంజీ దర్శకత్వంలో పీవీపీ ఈ చిత్రాన్ని నిర్మించారు. స్పానిష్ సినిమా `ది ఇన్విజిబుల్ గెస్ట్` చిత్రం స్ఫూర్తితో తెరకెక్కిందని ప్రచారమైంది. ఈ సినిమాకి పోస్టర్-టీజర్-ట్రైలర్ తో విపరీతమైన క్రేజు వచ్చింది. శేష్ మారోసారి సరికొత్తగా థ్రిల్లర్ ని ట్రై చేస్తున్నాడనే నమ్మకం ఆడియెన్ కి కలిగింది.

క్షణం.. గూఢచారి లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత శేష్ పై నమ్మకంతో మార్కెట్ వర్గాలు భారీ బెట్టింగ్ కి రెడీ అయ్యాయి. ఈ సినిమాకి 7 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ సాగింది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీ మొత్తాల్ని నిర్మాతలు కళ్లజూస్తున్నారన్న ప్రచారం ఉంది. ఈ గురువారం నాడు సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. తాజాగా ఓపెనింగ్ డే వసూళ్ల వివరాలు తెలిశాయి. ఏరియా వైజ్ షేర్ వివరాలు పరిశీలిస్తే..నైజాం -64 లక్షలు.. సీడెడ్ – 16 లక్షలు.. ఉత్తరాంద్ర – 21 లక్షలు.. గుంటూరు – 13 లక్షలు.. తూ.గో జిల్లా- 21 లక్షలు.. కృష్ణ – 15 లక్షలు.. ప.గో జిల్లా- 10 లక్షలు.. నెల్లూరు – 5 లక్షలు మేర వసూలైందని తెలుస్తోంది. ఓవర్సీస్ రిపోర్ట్ తెలియాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల హక్కుల్ని రూ. 7 కోట్లకు అమ్మగా ఒకటో రోజునే 1.65 కోట్లు షేర్ వచ్చింది. ఇక ఇది గూఢచారి కంటే మూడు రెట్లు ఎక్కువ అని తెలుస్తోంది. `గూఢచారి` తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన షేర్ 63 లక్షలు. దాంతో పోలిస్తే బెటర్ రిజల్ట్ ని ఎవరు దక్కించుకుంది.

ఎవరు.. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన థ్రిల్లర్ చిత్రం. శేష్….ఈ చిత్రంలో విక్రమ్ వాసుదేవ్ అనే పోలీస్ అధికారిగా నటించారు. రెజీన రేప్ బాధితురాలిగా నటించగా.. నవీన్ చంద్ర హత్యకు గురయ్యే యువకుడి పాత్రలో నటించాడు. రకరకాల ట్విస్టులు.. మలుపుల తర్వాత అంతిమంగా అది హత్యనా.. లేక ఇంకేదైనానా? అన్నది తేలుతుంది. సమీక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వినిపించింది. ఈ సినిమా ఏ స్థాయి వసూళ్లు సాధిస్తుంది? అన్నది సోమవారం తర్వాతనే తేల్తుంది.
Please Read Disclaimer